లేడీ ఫ్యాన్ కోరిక తీర్చిన మెగా హీరో వరుణ్ తేజ్ వీడియోలు వైరల్.. ఏం చేశాడంటే?

by Dishafeatures1 |
లేడీ ఫ్యాన్ కోరిక తీర్చిన మెగా హీరో వరుణ్ తేజ్ వీడియోలు వైరల్.. ఏం చేశాడంటే?
X

దిశ, సినిమా: ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ వైరల్ అవుతుంటుంది. ఫలానా హీరో, హీరోయిన్ తమ వీడియో పై రియాక్ట్ అయితేనే తమ కెరీర్ లేదా స్టడీస్ పై ఫోకస్ పెడతామని పోస్టులు పెడుతున్నారు. విజయ్ దేవరకొండ అభిమానితో మొదలైన ఈ ట్రెండ్ .. ఆ తర్వాత విశ్వక్ సేన్, మృణాల్ ఠాకూర్.. ఇలా ఒక్కొక్కరిగా పాస్ అవుతూ వచ్చింది. కాగా తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ కి కూడా ఇలాంటి సంఘటన ఎదురైంది.

తాజాగా వరుణ్ నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ గత వారం రిలీజైన సంగతి తెలిసిందే. ఈ సినిమా గురించి ఒక లేడీ అభిమాని తన ఇన్‌స్టాగ్రామ్ లో వీడియో పోస్టు చేస్తూ.. ‘వరుణ్ తేజ్ గారు ఈ వీడియో పై కామెంట్ చేస్తే, నేను 200 అనాథ పిల్లలకు ‘ఆపరేషన్ వాలెంటైన్’ మూవీ షో ఏర్పాటు చేయిస్తా’ అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ పోస్ట్ చేసిన వరుణ్ తేజ్ రియాక్ట్ అవుతూ.. ‘ఎంత మంచి ఆలోచన. అయితే అనాథ పిల్లలకు ఆ స్పెషల్ షో ఏదో నేనే ఏర్పాటు చేయిస్తా. నా టీం నిన్ను సంప్రదించి, నీ సూచనలతో ఆ షో ఏర్పాటు అయ్యేలా. నీకు గుర్తుండిపోయే ఒక మధురమైన జ్ఞాపకంలా చేస్తాము’ అంటూ వరుణ్ కామెంట్ చేశారు. ఇక చెప్పినట్లు షో కూడా ఏర్పాటు చేసి వరుణ్ తన గొప్ప మనసును చాటుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Read More..

Vishwambhara : ‘విశ్వంభర’ మూవీ టీమ్‌కు మొదలైనా కొత్త తలనొప్పి..

Next Story

Most Viewed