యంగ్ హీరోకు ఫుల్ సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీ.. ఆ సినిమా కచ్చితంగా చూడాలంటూ స్పెషల్ పోస్ట్

by Disha Web Desk 6 |
యంగ్ హీరోకు ఫుల్ సపోర్ట్‌గా మెగా ఫ్యామిలీ.. ఆ సినిమా కచ్చితంగా చూడాలంటూ స్పెషల్ పోస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరో కార్తికేయ ‘ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి మంచి విజయం సాధించాడు. ప్రస్తుతం కార్తికేయ, క్లాక్స్ డైరెక్షన్‌లో ‘బెదురులంక-2012’ సినిమా చేశాడు. ఇందులో డీజే టిల్లు ఫేం నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచేశాయి. ‘బెదురులంక 2012’ చిత్రం ఆగస్టు 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

ఈ క్రమంలో మెగా హీరో నాగబాబు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్పెషల్ పోస్ట్ పెట్టాడు. ‘‘మెగా ఫ్యాన్‌గా ఉండటం మనకు అపారమైన ఆనందాన్ని ఇస్తుంది. మనం మెగాస్టార్ నుంచి ప్రేరణ పొంది, వారిలా మారాలని ఆకాంక్షించినప్పుడు, అది మెగా అభిమానిగా ఉండటానికి నిజమైన అర్ధాన్ని ఇస్తుంది. హీరో కార్తికేయ ఈ విషయంలో ఒక ప్రత్యేక ఉదాహరణగా నిలిచాడు. ఈ అందమైన హంక్‌కి నేను హృదయపూర్వకంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అతని రాబోయే చిత్రం "బెదురు లంక" రేపు విడుదలై అద్భుతమైన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. సమీపంలోని థియేటర్‌లో సినిమాను చూడటం మర్చిపోవద్దు’’ అంటూ రాసుకొచ్చాడు. ఈ పోస్ట్ చూస్తుంటే కార్తికేయ స్టార్ హీరోగా మారాలని మెగా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అంటూ నెటిజన్లు అనుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి : పెళ్లికి ముందే ఆ విషయంలో Mega Familyకి కండిషన్ పెట్టిన Lavanya..?

Read More: వంగి మరీ ఎద అందాలు చూపిస్తున్న Nikki Tamboli..

Next Story

Most Viewed