Niharika: ఆ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక.. చర్చనీయాంశంగా మారిన వీడియోలు

by Mallepaka Hamsa |

మెగా డాటర్ నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదట బుల్లితెరకు పరిచయం అయింది.

Niharika: ఆ ప్రాంతంలో ప్రత్యేక పూజలు చేస్తున్న మెగా డాటర్ నిహారిక.. చర్చనీయాంశంగా మారిన వీడియోలు
X

దిశ, సినిమా: మెగా డాటర్ నిహారిక(niharika) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు మొదట బుల్లితెరకు పరిచయం అయింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో పలు సినిమాల్లో హీరోయిన్‌గా నటించింది. అయితే అనుకున్నంత క్రేజ్ సంపాదించుకోలేకపోయింది. ఈ నేపథ్యంలోనే జొన్నలగడ్డ చైతన్య(Jonnalagadda Chaitanya)ను పెళ్లి చేసుకుని పర్సనల్ లైఫ్‌లో బిజీ అయిపోయింది. అయితే వీరి కాపురం సజావుగా సాగకపోవడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఈ సంఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయినప్పటికీ కొన్ని రోజులపాటు ఫ్రెండ్స్, ఫ్యామిలీ వారితో వెకేషన్స్‌లో ఎంజాయ్ చేసిన నిహారిక కీలక నిర్ణయం తీసుకుంది. మళ్లీ సినిమా ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే నిహారిక ఓ నిర్మాణ సంస్థను పెట్టి ‘కమిటీ కుర్రోళ్లు’ (Committee Kurrollu)చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది.

అయితే ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టడంతో పాటు పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో పాటు నిహారిక హీరోయిన్‌గా కూడా నటించింది కానీ హిట్ అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఓ సినిమాను నిర్మిస్తున్న నిహారిక సోషల్ మీడియాలో కూడా ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది. తాజాగా, ఆమె తన నిర్మాణ సంస్థలో చండీ హోమం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇక అది చూసిన నెటిజన్లు అసలు ఆమె హోమం చేయడానికి కారణం ఏంటీ.. ఈ సమయంలో ఎందుకు చేసిందని నెట్టింట పలు చర్చలు జరుగుతున్నాయి.

Next Story