చీపురు చేతపట్టి వైజాగ్‌ బీచ్ శుభ్రం చేయనున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..

by Disha Web Desk 6 |
చీపురు చేతపట్టి వైజాగ్‌ బీచ్ శుభ్రం చేయనున్న మెగా కోడలు లావణ్య త్రిపాఠి..
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి గతేడాది మెగా హీరో వరుణ్ తేజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత ఇంటి బాధ్యతలు తీసుకుని ఇంట్లోనే ఉండిపోయింది. దీంతో అంతా ఇక లావణ్య త్రిపాఠి మళ్లీ సినిమాల్లోకి వస్తుందో లేదోనని? అనుమాన పడ్డారు. అయితే ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ఓ వెబ్‌సిరీస్‌లో నటించనున్నట్లు ప్రకటించింది. పెళ్లి అనంతరం లావణ్య త్రిపాఠి నటిస్తోన్న తెలుగు వెబ్‌ సిరీస్‌ ‘మిస్‌ పర్‌ఫెక్ట్‌’. ఇందులో బిగ్‌బాస్ విన్నర్ అభిజిత్ హీరోగా నటిస్తున్నాడు. స్కైలాబ్ మూవీ ఫేమ్ విశ్వక్ ఖండేరావ్ దర్శకత్వం వహించాడు.

అభిజ్ఞ, ఝాన్సీ, హర్షవర్ధన్, మహేశ్ విట్టా, హర్ష్ రోహన్ కీలక పాత్రలు పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై సుప్రియ యార్లగడ్డ ఈ సిరీస్‍ను నిర్మించడం విశేషం. ఈ వెబ్‌సిరీస్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. అయితే మిస్ పర్‌ఫెక్ట్ వెబ్ సిరీస్ ఫిబ్రవరి 2న ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ-హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ క్రమంలో మూవీ యూనిట్ ప్రమోషన్స్ వెరైటీగా ప్లాన్ చేశారు. నేషనల్ క్లీన్లినెస్‌ డే వేడుకల్లో భాగంగా ఆదివారం (జనవరి 28) విశాఖపట్నంలో బీచ్‌ క్లీనింగ్ డ్రైవ్ చేపట్టనున్నారు.

ఈ కార్యక్రమంలో లావణ్య త్రిపాఠితో పాటు హీరో అభిజిత్‌ కూడా ఈ క్లీనింగ్‌ డ్రైవ్‌లో పాల్గొననున్నాడు. ఉదయం 6గంటలకు వైఎంసీఏ బీచ్ వద్ద స్థానికులతో కలసి పరిసరాలను క్లీన్‌ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌లో అందరూ పాల్గొని విజయవంతం చేయాలని మిస్‌ పర్‌ఫెక్ట్‌ టీమ్‌తో పాటు మెగా కోడలు కోరుతూ ఓ వీడియో చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. ఇక అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతూ లావణ్య పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Next Story

Most Viewed