వైట్ నెట్ శారీలో మెగా కోడలు లావణ్య.. వరుణ్‌ను అస్సలు వదలట్లేదుగా!

by Mallepaka Hamsa |   (  Updated:2023-08-07 09:13:23  IST  )

టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరకీ షాకిచ్చారు.

వైట్ నెట్ శారీలో మెగా కోడలు లావణ్య.. వరుణ్‌ను అస్సలు వదలట్లేదుగా!
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ యంగ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి- వరుణ్ తేజ్ ప్రేమించుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల సడెన్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకుని అందరకీ షాకిచ్చారు. త్వరలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం మెగా కోడలు లావణ్య వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. అయినా సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందచందాలను ఆరబోస్తూ రచ్చ చేస్తోంది.

తాజాగా, లావణ్య వైట్ నెట్ శారీలో దిగిన ఫొటోస్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అందులో ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపిస్తోంది. దీంతో అది చూసిన నెటిజన్లు వరుణ్ తేజ్‌ పెట్టిన రింగునే అస్సలు వదలట్లేదు పెళ్లి జరిగాక ఆయనను కూడా వదలదంటూ కామెంట్లు పెడుతున్నారు. మామూలుగా ఎవరైనా సెలబ్రిటీ జంటలు ఎంగేజ్మెంట్ చేసుకున్న కొన్ని రోజులకే ఆ రింగ్స్ తీసి పక్కకు పడేస్తూ ఉంటారు. కానీ లావణ్య అలాగే ఉంచుకోవడంతో మెగా అభిమానులు ఫిదా అవుతున్నారు.

Click here for Lavanya Tripathi Instagram link

Also Read: వామ్మో అషు రెడ్డి అందాలు.. నెక్స్ట్ లెవెల్లో ఆరబోసిందిగా..

Next Story