కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న సీనియర్ నటికి మెగా బ్రదర్ సాయం!

by Disha Web Desk 7 |
కోట్ల ఆస్తులు పోగొట్టుకున్న సీనియర్ నటికి మెగా బ్రదర్ సాయం!
X

దిశ, సినిమా: సీనియర్ యాక్టర్ జయలలిత గురించి పరిచయం అక్కర్లేదు. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పాపులారిటీని పెంచుకున్న జయలలిత ఇప్పటికీ పలు సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తూ ప్రశంసలు అందుకుంటుంది. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటి తన వ్యక్తిగత విషయాలు వెల్లడించింది. ‘లక్ష్మీదేవిని నేను నిర్లక్ష్యం చేశాను కాబట్టే నా నుంచి విడిపోయింది. నేను రూ.4 కోట్ల రూపాయలు నష్టపోయాను. నేను ఆటోలో వెళ్లడం చూడలేక అనిల్ అనే వ్యక్తి కారు ఇచ్చాడు. ఆ కారు ఉన్న నాకు ఆనందం లేదు. మనది కానిది మనకు తృప్తి ఇవ్వదు. నన్ను మోసం చేసిన వ్యక్తి చాలా మందిని మోసం చేసి వెళ్లిపోయాడు. కానీ ఇండస్ట్రీలో ఎవరూ సహాయం చేయలేదు. చివరకు నాగబాబుగారి దగ్గర డబ్బులు తీసుకున్న. నాకు అది ఇష్టం లేదు కానీ తప్పని పరిస్థితి’ అంటూ చెప్పుకొచ్చింది జయలలిత.

ఇవి కూడా చదవండి : స్టార్ హీరోయిన్ ఆస్తి కబ్జా.. ఆపై ఆమె వీక్‌నెస్‌ను ఆసరా చేసుకొని బెదిరింపులు

Next Story

Most Viewed