- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మెగా బ్యూటీ షాకింగ్ నిర్ణయం.. డబ్బుల కోసం ఇంతకు దిగజారాలా అంటూ నెటిజన్లు ఫైర్
ఇప్పటికే 10 వేల మంది వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంటే దీని ద్వారా ఆమె నెలకు దాదాపు రూ. 30 లక్షల వరకు సంపాదిస్తోందని లెక్కలు వేస్తున్నారు నెటిజన్లు.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గినప్పుడు చాలామంది భామలు సోషల్ మీడియాను ప్రత్యామ్నాయ మార్గంగా ఎంచుకుంటున్నారు. కేవలం ఫొటోలు, వీడియోలు షేర్ చేయడమే కాకుండా, ఇటీవల కాలంలో సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా డబ్బు సంపాదించడం ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. తాజాగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘చిరుత’ సినిమా హీరోయిన్ నేహా శర్మ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఇప్పుడు నెట్టింట పెద్ద దుమారాన్నే రేపుతోంది. గతంలో యాంకర్ విష్ణుప్రియ, నటి అనన్య నాగళ్ల తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో ప్రత్యేక కంటెంట్ కోసం సబ్‌స్క్రిప్షన్ ఆప్షన్‌ను తీసుకువచ్చినప్పుడు తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఇప్పుడు అదే బాటలో నేహా శర్మ కూడా నడుస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్లలో ప్రత్యేకమైన కంటెంట్ చూడాలనుకునే వారి కోసం నెలకు రూ. 299 ఛార్జ్ చేస్తోందట. సుమారు 20 లక్షల మంది ఫాలోవర్లు ఉన్న నేహాకు, ఇప్పటికే 10 వేల మంది వరకు సబ్‌స్క్రైబర్లు ఉన్నట్లు సమాచారం. అంటే దీని ద్వారా ఆమె నెలకు దాదాపు రూ. 30 లక్షల వరకు సంపాదిస్తోందని లెక్కలు వేస్తున్నారు నెటిజన్లు.
నేహా శర్మ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చిన నటి కాదు. ఆమె తండ్రి అజిత్ శర్మ బీహార్‌లో ప్రముఖ రాజకీయ నాయకుడు. ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్న కుటుంబం నుంచి వచ్చిన నేహా, ఇలా కేవలం డబ్బు కోసం సబ్‌స్క్రిప్షన్ పేరుతో యూత్‌ను ఆకర్షించడంపై నెటిజన్లు మండిపడుతున్నారు. "డబ్బుకు తక్కువ లేకపోయినా, కేవలం పాపులారిటీ కోసమో లేదా మళ్ళీ సినిమా అవకాశాలు దక్కించుకోవాలనే తాపత్రయంతోనే ఇంతలా దిగజారుతున్నారా?" అంటూ నెట్టింట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సబ్‌స్క్రిప్షన్ తీసుకున్న వారికి మాత్రమే కనిపించే ఈ ప్రత్యేక కంటెంట్ యువతను తప్పుదోవ పట్టించే విధంగా ఉంటోందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సెలబ్రిటీ హోదాలో ఉండి ఇలాంటి పనులకు పాల్పడటం సరికాదని, ఇది సమాజంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చర్చించుకుంటున్నారు. సోషల్ మీడియాను కేవలం అభిమానులతో టచ్‌లో ఉండటానికి కాకుండా, ఇలా వ్యాపార కేంద్రంగా మార్చుకోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.






