70 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ.. నెట్టింట సంచలనంగా మారిన ట్వీట్

by Mallepaka Hamsa |

యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది.

70 ఏళ్ల హీరోతో రొమాన్స్ చేయబోతున్న మెగా బ్యూటీ.. నెట్టింట సంచలనంగా మారిన ట్వీట్
X

దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శన్(Kalyani Priyadarshan) ‘హలో’ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయింది. మొదటి చిత్రంతోనే అమ్మడు మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత మెగా హీరో సాయి ధరమ్ తేజ్ సరసన ‘చిత్రలహరి’ మూవీలో నటించింది. ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంతో పాటు కళ్యాణి ప్రియదర్శన్ నటన అందరికీ మెస్మరైజ్ చేసింది. అయినప్పటికీ తెలుగులో పెద్దగా అవకాశాలు రావపోడంతో తమిళ, మలయాళ భాషల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. గత ఏడాది ‘వర్షంగల్కు శేషం’ మూవీతో వచ్చింది. ప్రస్తుతం కళ్యాణి ప్రియదర్శన్, ఫహాద్ ఫాజిల్(Fahad Fazil) సరసన ‘ఓడుం కుతీరా చదుం కుతీరా’ చిత్రంలో నటిస్తోంది. అల్తాఫ్ సలీమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఆగస్టు 29న విడుదల కాబోతోంది.

ఇదిలా ఉంటే.. తాజాగా, కళ్యాణి ప్రియదర్శన్ తమిళంలో ఓ స్టార్ హీరో సినిమాలో అవకాశం అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కోలీవుడ్ స్టార్ హీరో కమల్ హాసన్(Kamal Haasan), అన్‌బరీవ్ కాంబోలో రాబోతున్న మూవీలో కళ్యాణి ప్రియదర్శన్ నటిస్తున్నట్లు టాక్. KH-237 వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ షూటింగ్ ఆగస్టులో ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ప్యాక్డ్ చిత్రంగా రాబోతుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. యంగ్ హీరోయిన్ పోయి పోయి 70 ఏళ్ల హీరోతో నటించడం ఏంటని పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. అయితే ఇందులో ఆమె హీరోయిన్‌గా నటిస్తుందా? లేక ఇతర పాత్రలో కనిపించనుందా అనేది తెలియాల్సి ఉంది.

LINK

Next Story