- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
లగ్జరీ కారు కొని రికార్డు క్రియేట్ చేసిన మెగా బ్యూటీ.. దాని రేటు ఎంతంటే?
సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు చాలా మంది తమ లగ్జరీ వస్తువుల వల్లే ఒక్కోసారి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటుటారు.

దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు చాలా మంది తమ లగ్జరీ వస్తువుల వల్లే ఒక్కోసారి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంటుటారు. సినిమా అవకాశాలు లేకపోయినప్పటికీ తమ రేంజ్‌కు తగ్గట్లుగా ఉంటారు. అందులో కోలీవుడ్ బ్యూటీ మృణాళిని రవి(Mrinalini Ravi) కూడా ఒకరు. ‘సూపర్ డీలక్స్’ ద్వారా వచ్చి వరుణ్ తేజ్ ‘గద్దలకొండ గణేష్’ చిత్రంలో హిట్ అందుకుని ఫుల్ ఫేమ్ దక్కించుకుంది. ఇక పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా అవకాశాలు రాబట్టుకోలేకపోయింది. గత కొద్ది రోజులనుంచి అవకాశాలు లేక కాళీగా ఉంటుంది. ఇటీవల ‘డూప్లికేట్’ (Duplicate)మూవీలో హీరోయిన్‌గా తీసుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే.. తాజాగా, మృణాళిని రవి లగ్జరీ కారు కొన్నది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలపడంతో అంతా దాని రేట్ గురించి సెర్చ్ చేయడం మొదలెట్టేశారు. తాజా సమాచారం ప్రకారం.. లేటెస్ట్‌గా మార్కెట్‌లోకి వచ్చిన మహింద్రా BE6 ఎలక్ట్రిక్ SUV లగ్జరీ కానును సొంతం చేసుకుంది. ఈ కార్లను ఆగస్టులో లాంచ్ చేయగా.. ఆ కారు మోడల్‌ను దక్కించుకున్న మొదటి వ్యక్తిగా మృణాళిని రికార్డు క్రియేట్ చేసింది. ఇక ఈ కారుకు రూ. 28లక్షల వరకు ఉంటుందని తెలుస్తోంది. బ్యాట్‌మ్యాన్ ఎడిషన్ BE6 మోడల్ కారును ఇప్పటికే స్టార్ క్రికేటర్లు, బాలీవుడ్ నటుడు సొంతం చేసుకోగా.. దక్షిణాది నటుల్లో ఈ కారు సొంతం చేసుకున్న తొలి నటి మృణాళిని మాత్రమే అని తెలుస్తోంది.






