- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మెగా-158’ సినిమాకు ముహూర్తం ఫిక్స్.. గెస్ట్‌గా టాలీవుడ్ స్టార్ హీరో
ఈ సినిమా పూజా కార్యక్రమాలకు గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాబోతున్నట్లు టాక్.

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి కాంబోలో రాబోతున్న భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు మళ్లీ కలయికలో ఓ భారీ ప్రాజెక్ట్ సెట్ అవడంతో అప్డేట్స్ కోసం అంతా వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమాను అధికారికంగా ప్రకటించగా.. పూజా కార్యక్రమాలు మే 21న ఘనంగా జరగబోతున్నట్లు చిత్రబృందం తెలిపింది. ‘మెగా-158’ వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీకి తమన్ సంగీతం అందిస్తుండగా.. ఇందులో హీరోయిన్‌గా ఎవరు నటిస్తారనే విషయంపై సోషల్ మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో.. తాజాగా, ఈ సినిమా పూజా కార్యక్రమాలకు గెస్ట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రాబోతున్నట్లు టాక్. ఆయనతో పాటు పలువురు దర్శకనిర్మాతలు, రాజకీయ నాయకులు పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇక మెగా-158 చిరంజీవిని పవర్ ఫుల్ పాత్రలో చూపించబోతున్నట్లు టాక్. సినిమా లాంచ్ ముగిసిన వెంటనే రెగ్యులర్ షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే హీరోయిన్ ఎవరనే విషయంపై కూడా మూవీ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేయనున్నట్లు టాక్.






