70 ఏళ్ళ ముసలాడితో రొమాన్స్ చేస్తా.. హీరోయిన్ సంచలనం ?

by Veldandi saikiran |
70 ఏళ్ళ ముసలాడితో రొమాన్స్ చేస్తా.. హీరోయిన్ సంచలనం ?
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంతమంది మాత్రమే అతి తక్కువ కాలంలో... పాపులర్ అవుతూ ఉంటారు. అలా తక్కువ కాలంలోనే పాపులర్ అయిన హీరోయిన్లలో... మీనాక్షి చౌదరి ( Meenakshi Chaudhary) ఒకరు. 28 సంవత్సరాల లోనే... టాలీవుడ్ అగ్రశ్రేణి హీరోయిన్ గా మారింది మీనాక్షి చౌదరి. మొన్న సంక్రాంతికి.. అదిరిపోయే సినిమాతో... సందడి చేసింది. విక్టరీ వెంకటేష్ హీరోగా చేసిన సంక్రాంతికి వస్తున్నాం... సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించి అందరిని మెప్పించింది.

ఈ సినిమా బంపర్ హిట్ కావడంతో... ఆమెకు తెలుగులో వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. ఇచ్చట వాహనములు నిలపరాదు అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ... గుంటూరు కారం లాంటి సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ముఖ్యంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో... సీనియర్ హీరో అయిన వెంకటేష్ సరసన... నటించి మెప్పించింది. అక్కినేని నాగచైతన్య సినిమాలో కూడా అవకాశాన్ని సంపాదించుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

అంటే ఒకే సమయంలో వాడు మామ ఇటు అల్లుడు... అనే తేడా లేకుండా ఛాన్స్ ఎక్కడ వస్తే... ఆ సినిమాలో నటిస్తోంది. తనకు ఏజ్ తో సంబంధం లేకుండా... ఎలాంటి పాత్ర అయినా చేసేస్తానని.... చెప్పకనే చెబుతోంది మీనాక్షి చౌదరి. దీనికి తగ్గట్టుగానే నిర్మాతలు, దర్శకులు అవకాశాలిస్తున్నారు. ఇది ఇలా ఉండగా.... అక్కినేని నాగచైతన్య... ఇటీవల తండేల్ సినిమాతో హిట్ అందుకున్నాడు. త్వరలోనే... విరూపాక్ష సినిమా చేసిన కార్తీక్ దండుతో చేయబోతున్నాడట అక్కినేని నాగచైతన్య. ఈ సినిమాలో అక్కినేని నాగచైతన్య రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడట. ఇందులోనే... మీనాక్షి చౌదరికి అవకాశం వచ్చినట్లు చెబుతున్నారు.



Next Story

Most Viewed