సెక్యూరిటీ గార్డును ముద్దుపెట్టుకున్న స్టార్ సింగర్.. కామమే అంటున్న నెటిజన్లు

by Disha Web Desk 6 |
సెక్యూరిటీ గార్డును ముద్దుపెట్టుకున్న స్టార్ సింగర్.. కామమే అంటున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: ప్రముఖ హాలీవుడ్ సింగర్ అండ్ ఆంగ్ల బ్యాండ్ ‘ది 1975’ సభ్యుడు మాటీ హీలీ.. వింత ప్రవర్తనతో నెటిజన్లను ఆశ్చర్యపరిచాడు. తాజాగా తాను పాల్గొన్న ఓ సంగీత కచేరీలో భాగంగా స్టేజ్‌పై పర్ఫార్మెన్స్ చేస్తూ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన మాటీ.. ఇదే క్రమంలో వేదిక పక్కన నిలుచున్న సెక్యూరిటీ గార్డును ముద్దుపెట్టుకుని అభిమానులకు షాక్ ఇచ్చాడు. అయితే అదికూడా లిప్ కిస్ కావడం విశేషం. కాగా అంతటితో ఆగని గాయకుడు అతన్ని తన దగ్గరకు లాగి తన బుగ్గలు, మెడపై ముద్దులు పెట్టించుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుండగా.. ‘మాటీ ప్లిజ్ అతన్ని వదిలేయ్.. నీ కామవాంచ తట్టుకోలేడు’ అని కొంతమంది రిక్వెస్ట్ చేస్తుంటే మరికొందరు మాత్రం ‘ఓహ్.. నీవు ‘గే’ అని మాకు ఇంతకాలం తెలియదు’ అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.



Next Story