బాలకృష్ణ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. బర్త్ డేకు అదిరిపోయే సర్‌ప్రైజ్!

by Mallepaka Hamsa |

జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. మూవీ మేకర్స్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.

బాలకృష్ణ ఫ్యాన్స్‌కు భారీ గుడ్ న్యూస్.. బర్త్ డేకు అదిరిపోయే సర్‌ప్రైజ్!
X

దిశ, సినిమా: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో రాబోతున్న సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరిద్దరి కలయికలో వచ్చిన ‘వీరసింహారెడ్డి’ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఇప్పుడు ఈ సూపర్ హిట్ కాంబో మరోసారి రిపీట్ కావడం విశేషం. ప్రస్తుతం ‘NBK-111’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోంది. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై ప్రొడ్యూసర్ వెంకట సతీష్ కిలారు ఈ ప్రతిష్టాత్మక కమర్షియల్ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలయ్య సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా నటిస్తోంది.

ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక పవర్‌ఫుల్ యాక్షన్ కథాంశంతో రాబోతున్నట్లు సమాచారం. ఈ మూవీ కోసం చిత్ర యూనిట్ త్వరలోనే ముంబైలో ఒక లాంగ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా, తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక క్రేజీ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. జూన్ 10న నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు ఉన్న సంగతి తెలిసిందే. మూవీ మేకర్స్ అభిమానుల కోసం ఒక అదిరిపోయే గ్లింప్స్ విడుదల చేసి సర్‌ప్రైజ్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట. బాలయ్య పుట్టినరోజు కానుకగా రాబోయే ఈ గ్లింప్స్‌లో ఆయన మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉండేలా దర్శకుడు గోపీచంద్ మలినేని డిజైన్ చేసినట్లు టాక్. ఈ అప్‌డేట్ గురించి తెలుసుకున్న నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

Next Story