- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ క్లాస్ డైరెక్టర్‌తో మాస్ మహారాజ్ రవితేజ నెక్స్ట్ మూవీ.. నెట్టింట చక్కర్లు కొడుతున్న న్యూస్
మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు తన నటనతో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు.

దిశ, సినిమా: మాస్ మహారాజ్ రవితేజ(Raviteja) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి నేడు తన నటనతో స్టార్ హీరోగా రాణిస్తున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో చిన్న పాత్రలు పోషించిన ఆయన.. అనతి కాలంలోనే హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ప్లాప్స్, హిట్స్‌తో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకుంటున్నాడు. అయితే గత ఏడాది వచ్చిన ఈగల్, మిస్టర్ బచ్చన్ వంటి బ్యాక్ బ్యాక్ సినిమాలు డిజాస్టర్స్‌గా నిలవడంతో.. ప్రజెంట్ సినిమాల వేగాన్ని తగ్గించి కథ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
ఇందులో భాగంగా ప్రస్తుతం రవితేజ ‘మాస్ జాతర’(Mass Jathara) మూవీలో నటిస్తున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై భాను భోగవరపు(Bhanu Bhogavarapu) దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక యంగ్ బ్యూటీ శ్రీలీల(Sree Leela) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రం సమ్మర్‌లో రిలీజ్ కానుంది. ఈ క్రమంలో రవితేజకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే.. మాస్ జాతర సినిమా తర్వాత రవితేజ.. దర్శకుడు కిషోర్ తిరుమల(Kishore Tirumala)తో ఓ సినిమా చేయబోతున్నాడట.
క్లాస్ సినిమాలతో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ డైరెక్టర్‌తో నెక్స్ట్ మూవీకి రవితేజ స్టోరీ నచ్చి ఓకే చెప్పినట్టు సమాచారం. అయితే మాస్ జాతర మూవీ రిలీజ్ అయ్యాక కిషోర్ తిరుమల రవితేజతో మూవీ స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ఇప్పటికే కిషోర్ స్టార్ట్ చేసేశారట. మరి మాస్ హీరో రవితేజ, క్లాస్ లవ్ స్టోరీలు తీసే కిషోర్ తిరమల మధ్య వచ్చే మూవీ ఓ రేంజ్‌లో ఉంటుందో చూడాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.






