- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
"మాస్ జాతర" వదిలేసుకున్న ఇద్దరు తెలుగు హీరోలు ?
గోపీచంద్ ఈ సినిమాను చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వద్దకు ఈ సినిమా కథను

దిశ, వెబ్ డెస్క్: మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మాస్ జాతర. చాలా రోజుల తర్వాత రవితేజ భారీ బడ్జెట్ సినిమాతో అభిమానుల ముందుకు వచ్చారు. మాస్ జాతర సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రిలీజ్ అయి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. మొదటి షో తోనే మంచి రెస్పాన్స్ సొంతం చేసుకున్న మాస్ జాతర సినిమా, ప్రేక్షకుల మన్ననలను అందుకుంది. ఈ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాను ఏకంగా రూ.90 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. నాగ వంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మించారు.
ఈ సినిమాలో రవితేజ హీరోగా మెరువగా శ్రీ లీల హీరోయిన్ గా దుమ్ములేపారు. మాస్ జాతర సినిమాలో రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్ గా కనిపించారు. అయితే ఈ సినిమాలో మొదట హీరోగా రవితేజను కాకుండా గోపీచంద్ ను పెట్టి సినిమా తీయాలని అనుకున్నారట. అయితే గోపీచంద్ ఈ సినిమాను చాలా సున్నితంగా రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ వద్దకు ఈ సినిమా కథను తీసుకువెళ్లి వినిపించారట. ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నానని సిద్దూ కూడా వదిలేశారట. అనంతరం ఈ సినిమా కథ కాస్త హీరో రవితేజ వద్దకు వెళ్ళింది. కథ విన్న వెంటనే హీరో రవితేజ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట.






