- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘మాస్ జాతర’ ట్రైలర్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్.. అగ్ని పండుగ కోసం సిద్ధంగా ఉండాలంటూ పోస్ట్
బాక్సాఫీసు వద్ద భారీ సినిమాల హవా కొనసాగుతోంది. ఒక నెలలో దాదాపు మూడు, నాలుగు అయినా విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

దిశ, సినిమా: బాక్సాఫీసు వద్ద భారీ సినిమాల హవా కొనసాగుతోంది. ఒక నెలలో దాదాపు మూడు, నాలుగు అయినా విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే కాసుల వర్షం కురిపిస్తూ దర్శకనిర్మాతలకు లాభాలు తెచ్చిపెడుతున్నాయి. ఈ నెలలో.. మాస్ మహారాజా రవితేజ(raviteja) బాక్సీఫీసు వద్ద తన విశ్వరూపం చూపించేందుకు సిద్ధమయ్యాడు. ‘మాస్ జాతర’ (mass jathara)సినిమాతో త్వరలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకుని అక్టోబర్ 31న విడుదల కానుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ బాక్సాఫీసు వద్ద భారీ సినిమాల హవా కొనసాగుతోంది. ఒక నెలలో దాదాపు మూడు, నాలుగు అయినా విడుదలవుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.చేసిన చిత్రబృందం ఇందులోని సాంగ్స్, పోస్టర్స్, టీజర్‌ను రిలీజ్ చేసి అంచనాలను పెంచుతున్నారు. విడుదల తేదీ దగ్గర పడటంతో ‘మాస్ జాతర’ ట్రైలర్ రాబోతున్నట్లు ప్రకటించారు. ‘‘దీపావళి ఇంకా అయిపోలేదు.. అక్టోబర్27 న రవితేజ బాణసంచా ఫైర్‌తో ప్రారంభిస్తారు.
ఎంటర్‌టైన్‌మెంట్ ఇచ్చేందుకు సిద్ధం అయ్యారు. ట్రైలర్‌తో అగ్ని పండుగను జరుపుకుంటారు’’ అని తెలిపారు. అలాగే ముఖమంతా రక్తంతో ఉన్న రవితేజ పోస్టర్‌ను షేర్ చేశారు. కాగా.. భాను భోగవరపు దర్శకత్వం వహించగా.. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూర్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ బ్యానర్స్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇందులో మాస్ మహారాజా సరసన శ్రీలీల (sreeleela)హీరోయిన్‌గా నటిస్తోంది.ఈ సినిమాకు భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. ఇప్పటికే ఇందులోంచి వచ్చిన పాటలు యూట్యూబ్‌ను షేక్ చేస్తున్నాయి.రవితేజ, శ్రీలీల ఫుల్ జోష్, ఎనర్జీతో వేసిన స్టెప్పులు అదరగొడుతున్నారు.






