‘మాస్ జాతర’ వాయిదా.. చివరి నిమిషంలో రవితేజ అభిమానులకు బిగ్ షాకిచ్చిన మూవీ మేకర్స్

by Mallepaka Hamsa |

మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(mass jathara).

‘మాస్ జాతర’ వాయిదా.. చివరి నిమిషంలో రవితేజ అభిమానులకు బిగ్ షాకిచ్చిన మూవీ మేకర్స్
X

దిశ, సినిమా: మాస్ మహారాజా రవితేజ(Ravi Teja), శ్రీలీల(Sreeleela) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్ జాతర’(mass jathara). ఈ సినిమా రవితేజ 75వ ప్రాజెక్ట్‌గా రాబోతుండటంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. భాను బోరవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్‌పై సూర్య దేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకుల్లో హైప్ పెంచాయి.

ఇక ఈ మూవీ ఆగస్టు 27న థియేటర్స్‌లోకి రాబోతుందని ఇప్పటికీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఎప్పుడెప్పుడు వస్తుందా అని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, ‘మాస్ జాతర’ మూవీ మేకర్స్ చివరి నిమిషంలో రవితేజ అభిమానులకు బిగ్ షాకిచ్చారు. రేపు విడుదల కావట్లేదని ప్రకటించారు. ‘‘ఆగస్టు 27న ‘మాస్ జాతర’ను విడుదల చేయడం లేదు. సమ్మలు, కీలకమైన సన్నివేశాలు పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా సినిమాను అనుకున్న తేదీకి సకాలంలో షూటింగ్ ఫినిష్ చేయలేకపోయాము.

కంగారుగా సినిమా రిలీజ్ చేయడం కంటే సమయం తీసుకొని ది బెస్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. రవితేజ అభిమానులకు గొప్ప అనుభూతిని అందించాలనే ఈ నిర్ణయం తీసుకున్నాము. త్వరలో థియేటర్లలో మీకు అతిపెద్ద మాస్ ఫీస్ట్‌ను అందించడానికి బృందం ఎంతగానో కృషి చేస్తోంది. త్వరలోనే కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తాము’’ అని రాసుకొచ్చారు. అంతేకాకుండా రవితేజ పోలీస్ డ్రెస్ వేసుకున్న పోస్టర్‌ను షేర్ చేశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న రవితేజ అభిమానులు షాక్ అవుతున్నారు.

link

Next Story