- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎదురుచూపులకు తెర దించిన కవిన్.. ‘మాస్క్’ రిలీజ్ డేట్ ప్రకటన విడుదల
తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్క్’(Mask) .

దిశ, సినిమా: తమిళ డార్క్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘మాస్క్’(Mask) . షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమైనట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ‘మాస్క్’ మూవీ నవంబర్ 21న రాబోతున్నట్లు తెలుపుతూ.. ఓ పోస్టర్‌ను షేర్ చేయగా.. ఇందులో కవిన్(Kavin) నోట్లపై బండి పెట్టి పడుకొని నవ్వుతూ.. కాలుపై కాలు వేసుకుని గాగూల్స్ పెట్టుకుని స్టైలీష్ లుక్‌లో కనిపించాడు. ఈ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ ప్రకటనతో ఇక కవిన్ అభిమానుల ఎదురుచూపులకు బ్రేక్ పడినట్లు అయింది. ఈ పోస్ట్‌కు ‘‘దాగి ఉన్న గందరగోళ స్థితి బహిర్గతం కావడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడైనా పెద్ద రూపం తీసుకుని పేలవచ్చును’’ అనే క్యాప్షన్ జత చేశారు. కాగా.. ‘మాస్క్’ సినిమాతో కవిన్ హీరోగా నటిస్తుండగా.. ఆండ్రియా జెర్మియా(Andrea Jeremiah), రుహానీ శర్మ హీరోయిన్లుగా అలరించబోతున్నారు. వికర్ణన్ అశోక్ దర్శకత్వం వహిస్తుండగా.. ది షో మస్ట్ గో ఆన్, బ్లాక్ మద్రాస్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై నిర్మించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.






