- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాకు అలాంటి పాత్రలో నటించాలని ఉంది: ఎన్‌టీఆర్
టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ హాలీవుడ్ మూవీ అవకాశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

X
దిశ, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో ఎన్‌టీఆర్ హాలీవుడ్ మూవీ అవకాశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇటీవల అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 80వ గోల్డెన్ గ్లోబ్ అవార్డుల వేడుకలో తను నటించిన 'నాటు నాటు' సాంగ్ బెస్ట్ ఒరిజినల్ అవార్డ్ అందుకుంది. ఈ సందర్భంగా మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తారక్ మాట్లాడుతూ.. 'హాలీవుడ్‌లో చాన్స్ వస్తే తప్పకుండా స్వీకరిస్తా. అయితే మొదటి చాన్స్ 'మార్వెల్' సిరీస్‌లోనే రావాలని కోరుకుంటా. ఎందుకంటే నాకు ఐరన్ మాన్ అంటే చాలా ఇష్టం. అలాంటి క్యారెక్టర్ నాకు చాలా దగ్గరగా అనిపిస్తుంది. అందుకే 'మార్వెల్' చేయాలని ఎప్పటినుంచో కోరిక. నా అభిమానులు నా నుంచి ఈ క్యారెక్టర్ కోరుకుంటున్నట్లు చాలాసార్లు చెప్పారు. టైమ్ బాగుంటే త్వరలోనే పిలుపు రావొచ్చేమో' అంటూ ఆసక్తికరంగా చెప్పుకొచ్చాడు.
Read more:
Next Story






