- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రాజాసాబ్ మూవీలో మరింత మసాలా యాడ్ చేస్తున్న మారుతి.. హైప్ పెంచుతున్న న్యూస్
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఈశ్వర్’(Eeshwar) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘వర్షం’(Varsham) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు.

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(Prabhas) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ‘ఈశ్వర్’(Eeshwar) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి.. ‘వర్షం’(Varsham) మూవీతో బ్లాక్ బస్టర్ విజయం సాధించాడు. ఆ తర్వాత వరుస చిత్రాల్లో నటిస్తూ స్టార్ హీరో రేంజ్‌కి ఎదిగాడు. ఇక ఆయన హైట్, పర్సనాలిటీకి సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందనే చెప్పాలి. అయితే అప్పటి వరకు స్టార్ హీరోగా రాణిస్తున్న ప్రభాస్.. ‘బాహుబలి’-1,2 లతో ఏకంగా పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ఆ తర్వాత నటించిన దాదాపు అన్ని చిత్రాల్లో నటించిన ఆయన భారీ బ్లాక్ బస్టర్ విజయాలే సాధించాడు.
రీసెంట్‌గా ‘కల్కి-2898ఏడీ’(Kalki 2898AD) సినిమాతో మనముందుకు వచ్చి మంచి విజయం సాధించాడు. నాగ్ అశ్విన్(Nag Ashwin) తెరకెక్కించిన ఈ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్(Amitab Bachchan), కమల్ హాసన్(Kamal Haasan), విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), దీపిక పదుకొణె(Deepika Padukone), దిశా పటాని(Disha Patani), కీర్తి సురేష్(Keerthi Suersh) వంటి వాళ్లు కీ రోల్ ప్లే చేశారు. అయితే గత ఏడాది జూన్ 27న రిలీజ్ అయిన ఈ మూవీ రూ.2000 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నాడు. జాసా
ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘రాజా సాబ్’(Raaja Saab) ఒకటి. మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా హారర్ కామెడీ జోనర్‌లో రూపొందుతుంది. అయితే ఫస్ట్ టైం ప్రభాస్ ఫన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో మన ముందుకు అలరించడానికి రాబోతున్నాడు. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి వచ్చిన ప్రతి అప్డేట్ ఆకట్టుకుని మూవీపై మరింత హైప్ పెంచాయి. ఈ క్రమంలో ఈ సినిమాకు సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వివరాల్లోకి వెళితే..
బేసిక్‌గా మారుతి సినిమాలు అంటే హీరో క్యారెక్టర్ కన్నా కమెడియన్స్‌కే ఎక్కువ స్కోప్ ఇస్తాడన్నా సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా అలాంటి ప్యాటర్నే ఫాలో అవుతున్నాడట ఆ డైరెక్టర్. మరి ఇంతకీ ఆ టాప్ కమెడియన్స్ మరెవరో కాదండోయ్.. బ్రహ్మానందం(Brahmanandam), అలీ(ali) లాంటి సీనియర్ లెజెండ్స్‌తో పాటు యంగ్ సెన్సేషనల్ వెన్నెల కిషోర్(Vennela Kishore), సప్తగిరి(Sapthagiri), గెటప్ శ్రీను(Getup Srinu) లాంటి వాళ్లతో పాటు కోలీవుడ్ నుంచి యోగిబాబు(Yogi Babu), వీటీవీ గణేష్(Vtv Ganesh)లను కూడా మారుతి లాక్ చేశాడట.
అయితే ఒకరిద్దరు కమెడియన్స్ ఉంటేనే ఆ సినిమా వేరే లెవెల్‌లో ఉంటుంది. మరి ఇంతమంది కమెడియన్స్ ఉన్న చిత్రం అంటే ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదనుకుంటా. కాగా వీరి కోసం స్పెషల్ స్క్రిప్ట్ కూడా రాయించినట్లు టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియాలంటే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.






