- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘ది రాజాసాబ్’ వల్ల అసౌకర్యానికి గురైన వారికి క్షమాపణలు చెప్పిన మారుతి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab).

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas), మారుతి(Maruthi) కాంబోలో భారీ అంచనాల మధ్య వచ్చిన మూవీ ‘ది రాజాసాబ్’(The Rajasaab). ఈ సినిమా జనవరి 9న విడుదలై.. బాక్సాఫీసు వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. అలాగే పలు విమర్శలు చేస్తూ.. ప్రభాస్ అభిమానులు.. సినిమా థియేటర్స్‌ల్లో నానా హంగామా చేస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా, మారుతి స్పందించి క్షమాపణలు చెప్పారు. ‘‘మీడియా ఫ్రెండ్స్.. విమల్ థియేటర్ వద్ద మిత్రులు చాలా అసౌకర్యానికి గురయ్యారు. అర్థరాత్రి 1. 30 వరకు కూడా షోలు పడకపోయేసరికి చలిలో నిలబడ్డారని విన్నాను. నిజంగా అందరికీ నేను క్షమాపణలు చెబుతున్నాను.
ఎందుకంటే నాకు తెలియదు.. అంటే నా కప్ ఆఫ్ టీ కాదు అది. చాలామంది మీడియా ఫ్రెండ్స్ అందరికీ కూడా.. 1. 30కిఒక మూడు గంటల సినిమాఅది పడుకుని మంచి నిద్రలో ఉండాల్సిన సమయంలోమైండ్ గేమ్ చూపించాం. ఆ మైండ్ గేమ్ తర్వాత రిజల్ట్ కరెక్ట్‌గా నాలుగున్నరకి బాగా రాశారు. మంచిగ రాసిన వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను.ప్రభాస్ గారు నాలాంటి మిడ్ రేంజ్ డైరెక్టర్‌తో ఇలాంటి కొత్త సినిమాను మీకు అందించారు. ఆ అందించిన చిత్రాన్ని మీరు ముందుకు తీసుకెళుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది’’ అని చెప్పుకొచ్చారు.






