తమన్నాతో పెళ్లి.. ఊహించని సమాధానంతో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన విజయ్ వర్మ!

by Disha Web Desk 6 |
తమన్నాతో పెళ్లి.. ఊహించని సమాధానంతో బిగ్ ట్విస్ట్ ఇచ్చిన విజయ్ వర్మ!
X

దిశ, సినిమా: బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ పలు చిత్రాల్లో విలన్ పాత్రలో నటించి ఫుల్ పాపులారిటీ తెచ్చుకున్నాడు. అయితే విజయ్, గత కొద్ది కాలంగా స్టార్ హీరోయిన్ తమన్నాతో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఎప్పటినుంచో ప్రేమించుకుంటున్న వీళ్లు ఒక్కటిగా కలిసి ఎన్నోసార్లు కెమెరాలకు చిక్కారు. వార్తలు వైరల్ కావడంతో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా, విజయ్‌తో లవ్‌లో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో వీరి పెళ్లికి సంబంధించిన వార్తలు నిత్యం వస్తూనే ఉన్నాయి. వాటిపై వీరిద్దరు కూడా తమదైన స్టైల్లో స్పందిస్తున్నారు. ప్రస్తుతం తమన్నా, విజయ్ వరుస చిత్రాల్లో నటిస్తూ.. కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నారు.

తాజాగా, విజయ్ వర్మ తన ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో ముచ్చిటించాడు. అందులో ఓ నెటిజన్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారు అని ప్రశ్నించాడు. దానికి విజయ్ ‘‘ ఇప్పటికే మా అమ్మను మా మేనకోడలు ప్రశ్నలు అడుగుతోంది. ఈ ప్రశ్నను నేను పదే పదే హైదరాబాద్‌లో కూడా విన్నాను’’ అంటూ వెటకారంగా ఆన్సర్ ఇచ్చాడు. అంతేకాకుండా ఓ రెడ్ ఏమోజీని కూడా షేర్ చేశాడు. అలాగే మరో నెటిజన్ జిమ్‌కు వెళ్తారా అని అడగడంతో.. ‘ఏదైన సినిమా కోసం అవసరం అయితే జిమ్‌కు వెళ్తాను. లేకుంటే నేను యోగా చేయడానికి ఇష్టపడతాను’ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం విజయ్ వర్మ చాట్ నెట్టింట వైరల్ అవుతోంది. పెళ్లిపై ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోవడంతో తమన్నా ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు.




Next Story

Most Viewed