క్యాలెండర్‌ను మార్క్ చేసుకోండి.. ఈ మూవీ భరించలేనంత హాట్‌గా ఉండబోతుందంటూ సన్యా మల్హోత్రా పోస్ట్

by Mallepaka Hamsa |

బాలీవుడ్ యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా(Sanya Malhotra) ‘దంగల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

క్యాలెండర్‌ను మార్క్ చేసుకోండి.. ఈ మూవీ భరించలేనంత హాట్‌గా ఉండబోతుందంటూ సన్యా మల్హోత్రా పోస్ట్
X

దిశ, సినిమా: బాలీవుడ్ యంగ్ బ్యూటీ సన్యా మల్హోత్రా(Sanya Malhotra) ‘దంగల్’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి మూవీనే బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అమ్మడు ఓవర్ నైట్‌ స్టార్‌గా మారింది. ఆ తర్వాత తెలుగు, హిందీ చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. అంతేకాకుండా ఇటీవల తమిళ ఇండస్ట్రీకి సైతం పరిచయం అయింది. స్టార్ హీరో కమల్ హాసన్ ‘థగ్ లైఫ్’ సినిమాతో ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం సన్యా మల్హోత్రా ‘సన్నీ సంస్కారి కి తులసికుమారి’ (Sunny Samskari Ki Tulsikumari)మూవీలో నటిస్తోంది. శశాంక్ ఖైతాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ రొమాంటిక్ ఫ్యామిలీ డ్రామాను ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ ధావన్(Varun Dhawan), జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్నారు. అలాగే రోహిత్ సరాఫ్, మనీష్ పాల్, అక్షయ్ ఒబెరాయ్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా భారీ అంచనాల మధ్య అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

దీంతో ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా?అని సినీ ప్రియులు వెయిట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, సన్యా మల్హోత్రా ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది. ‘సన్నీ సంస్కారి కి తులసి కుమారి’ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి అయినట్లు తెలుపుతూ.. ‘‘ఈ మూవీ షూటింగ్‌లో మేము చాలా సరదాగా గడిపాము. దీన్ని చూడటం చాలా సరదాగా ఉంటుంది. అక్టోబర్-2 కోసం మీ క్యాలెండర్లను మార్క్ చేసుకోండి. ఎందుకంటే ‘సన్నీ సంస్కారి కి తులసి’ భరించలేనంత వేడిగా ఉంటుంది’’ అనే క్యాప్షన్ జత చేసింది. అలాగే టీమ్ అందరితో కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేసింది. దీంతో ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు ఓ మై గాడ్ వెయిట్ చేయలేకపోతున్నాము బ్లాక్ బస్టర్ లోడింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Next Story