- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘రామాయణ’ లోకి మరాఠీ నటుడి ఎంట్రీ.. ఇదొక గొప్ప అనుభూతి అంటూ ఎమోషనల్ కామెంట్స్
భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. చుట్టూ వినిపించే అనవసరపు మాటలను నేను అస్సలు పట్టించుకోను

దిశ, సినిమా: ఇండియన్ సినీ హిస్టరీలోనే ఎన్నడూ లేనంత అత్యంత భారీ బడ్జెట్‌తో, విజువల్ వండర్‌గా తెరకెక్కుతున్న మోస్ట్ అవేటెడ్ ఇండియన్ పీరియాడిక్ మైథలాజికల్ ఫిల్మ్ ‘రామాయణ’. దర్శకుడు నితీష్ తివారీ ఈ ఇతిహాస గాథను వెండితెరపై ఒక అద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు. నమిత్ మల్హోత్రా నిర్మిస్తున్న.. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ శ్రీరాముడిగా.. నేచురల్ బ్యూటీ సాయి పల్లవి సీత పాత్రలో నటిస్తోంది. రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా చేస్తున్నారు.యాక్షన్ స్టార్ సన్నీ డియోల్ హనుమంతుడిగా.. కాజల్ అగర్వాల్ మండోదరి పాత్రలో, టాలెంటెడ్ యాక్టర్ రవి దూబే లక్ష్మణుడుగా కనిపించనున్నారు. తాజాగా, మరాఠీ నటుడు ఆదినాథ్ కోఠారే ఇందులో భరతుడిగా నటిస్తున్నారు. మరాఠీ, హిందీ భాషల్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆదినాథ్ కోఠారే ఇప్పుడు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ‘రామాయణ’ చిత్రంలో భాగం అయ్యారు.
ఈ విషయాన్ని ఆదినాథ్ కోఠారే వెల్లడిస్తూ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌లో భాగం కావడంపై ఆదినాథ్ స్పందిస్తూ.. "భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాలో నటించే అవకాశం రావడం నా అదృష్టం. చుట్టూ వినిపించే అనవసరపు మాటలను నేను అస్సలు పట్టించుకోను. మన చేతిలో మంచి స్క్రిప్ట్ ఉన్నప్పుడు మరేదీ ముఖ్యం కాదు. రణబీర్ కపూర్ చాలా కష్టపడే, నిజాయితీ గల నటుడు. ఆయనతో కలిసి పనిచేయడం ఒక గొప్ప అనుభూతి" అని చెప్పారు. ‘రామాయణం’ సినిమాతో ఇండియన్ సినిమా నెక్స్ట్ లెవెల్‌కు వెళ్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక రెండు భాగాల్లో రాబోతున్న ఈ చిత్రం మొదటి పార్ట్ వచ్చే ఈ ఏడాది దీపావళికి, రెండవ భాగం వచ్చే ఏడాది దీపావళి కానుకగా విడుదల కానున్నాయి. ఈ రెండు భాగాలపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.






