- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Shivam Bhaje: కథలో చాలా ట్విస్టులు ఉంటాయి.. ‘శివం భజే’పై డైరెక్టర్ కామెంట్స్
అశ్విన్‌బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'శివం భజే'.

దిశ, సినిమా: అశ్విన్‌బాబు హీరోగా, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్‌గా నటించిన తాజా చిత్రం 'శివం భజే'. అప్సర్ దర్శకత్వంలో మహేశ్వర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆగస్ట్ 1న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మహేశ్వర్ రెడ్డి మీడియాతో ముచ్చటిస్తూ సినిమా విశేషాలను పంచుకున్నారు. 'శివం భజే' కథ వినగానే నచ్చింది. వెంటనే దర్శకుడికి అడ్వాన్స్ ఇచ్చి, కథను అశ్విన్ దగ్గరకు తీసుకెళ్లాం. అశ్విన్‌కు కూడా కథ నచ్చడంతో సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. ఇందులో ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయని అంశాలుంటాయి. కథలో రకరకాల ట్విస్టులుంటాయి. అవి అందరిని ఎంతో ఉద్వేగానికి గురిచేస్తాయి. కంటెంట్ బాగుంటే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. మా కంటెంట్‌పై ఆ నమ్మకం ఉంది. మౌత్‌టాక్ అనేది సినిమా విజయాన్ని నిర్ణయిస్తుంది. క్వాలిటీ కోసం ఖర్చుకు ఎక్కడా వెనుకాడలేదు. శివం భజే హిట్ అయితే ఈ చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేస్తాం. ఈ సినిమా విజయం సాధిస్తే సీక్వెల్‌ను కూడా చేసే ఆలోచనలో ఉన్నాం' అంటూ చెప్పుకొచ్చాడు.






