Mrunal Thakur: వారు కండీషన్ పెట్టడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా.. మృణాల్ షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-13 13:42:47  IST  )

సీరియల్స్ ద్వారా వచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది.

Mrunal Thakur: వారు కండీషన్ పెట్టడం వల్ల చాలా అవకాశాలు కోల్పోయా.. మృణాల్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: సీరియల్స్ ద్వారా వచ్చిన మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) అనతి కాలంలోనే క్రేజీ బ్యూటీగా మారిపోయింది. ‘సీతారామం’ (seetharamam) సినిమాతో హీరోయిన్‌గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఆమె ఘన విజయం సాధించింది. అంతేకాకుండా ఓవర్ నైట్ స్టార్‌గా మారి తన నటనతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసింది. ఇక మొదటి మూవీనే ఊహించని రెస్పాన్స్‌ను దక్కించుకోవడం అమ్మడుకి వరుస అవకాశాలు వచ్చాయి. అలా మృణాల్ బ్యాక్ టు బ్యాక్ చిత్రాల్లో నటించినప్పటికీ లాభం లేకుండా పోయింది. లస్ట్ స్టోరీస్-2, హాయ్ నాన్న(hai nanna), కల్కి(kalki) వంటి సినిమాలు హిట్ సాధించాయి. ఇక గత ఏడాది ‘ఫ్యామిలీ స్టార్’ మూవీతో ప్రేక్షకులను అలరించిన ఆమె భారీ డిజాస్టర్‌ను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా(Siddharth Malhotra) హీరోగా నటిస్తున్న ‘హై జవానీ తో ఇష్క్ హోనా హై’ (Hai Jawani Toh Ishq Hona Hai )మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

‘‘నా సినీ కెరీర్ ప్రారంభంలోనే నేను అనేక సినిమా అవకాశాలను తిరస్కరించాను. ఎందుకంటే.. అందులో ఇంటిమేట్ సీన్స్ అసౌకర్యంగా ఉండటం వల్ల నా తల్లిదండ్రులు తీవ్రంగా నిరాకరించారు. రొమాంటిక్, లిప్ లాక్ సీన్స్ చేసినప్పుడు నేను భయపడతాను. అందుకే ముద్దు పెట్టుకోవడం వంటి సినిమాలను తిరస్కరించాల్సి వచ్చింది. ఇలా అయితే కెరీర్ ఆగిపోతుందని నా తల్లిదండ్రులతో కూర్చుని మాట్లాడాను. సినిమా కెరీర్‌లో అలాంటి సీన్స్ కూడా ఒక భాగం. కాబట్టి నేను ఒక భాగాన్ని మిస్ చేసుకోలేను. అలా అని అలాంటి చిత్రాలే నా ఎంపిక కాదు అని వివరించాను. చాన్సులు తిరస్కరించడం వల్ల కొన్నిసార్లు మంచి అవకాశాలు మిస్ అవుతాయి అని చెప్పాను’’ అని చెప్పుకొచ్చింది. ఇక ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఈ కామెంట్స్ విజయ్ దేవరకొండతో చేసిన సినిమాలో ఆమె లిప్ కిస్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ సమయంలో భయపడినట్లు చెప్పిందని అంతా అభిప్రాయపడుతున్నారు.

Next Story