‘కన్నప్ప’ హార్ట్ డిస్క్ మాయం విషయంలో మనోజ్ హస్తం..అసలు నిజాలు బయటపడతాయంటూ మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Mallepaka Hamsa |   (  Updated:2025-05-31 12:18:06  IST  )

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(‘Kannappa’).

‘కన్నప్ప’ హార్ట్ డిస్క్ మాయం విషయంలో మనోజ్ హస్తం..అసలు నిజాలు బయటపడతాయంటూ మంచు విష్ణు షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతున్న లేటెస్ట్ సినిమా ‘కన్నప్ప’(‘Kannappa’). ఈ మూవీపై ప్రేక్షకులతో పాటు సినీ సెలబ్రిటీలకు భారీ అంచనాలు ఉన్నాయి. అయితే ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వం వహిస్తున్నారు. దీనిని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్స్‌పై భారీ బడ్జెట్‌తో మోహన్ బాబు(Mohan Babu) నిర్మిస్తున్నారు. అయితే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ‘కన్నప్ప’ జూన్ 27న థియేటర్స్‌లోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ‘కన్నప్ప’ మూవీకి సంబంధించిన హార్డ్ డిస్క్ మిస్ కావడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ విషయంపై చిత్రబృందం సైబర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘కన్నప్ప’ప్రమోషన్స్‌లో పాల్గొన్న మంచు విష్ణు.. చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌లో ఆసక్తికర కామెంట్లు చేశాడు. ‘‘24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీకి కొరియర్ వచ్చిన సమయంలో రఘు అనే వ్యక్తి అక్కడికి వచ్చాడు.

ఆ ప్రాకెట్ తీసుకుని, చరిత అనే అమ్మాయికి ఇచ్చాడు. ఇది జరిగి నాలుగు వారాలు అయింది. నేను అసలు ఈ విషయంపై ఫిర్యాదు చేయాలనుకోలేదు. వాళ్లిద్దరూ మా సోదరుడు మనోజ్ ఇంట్లో పరిచేస్తాన్నారో లేదో నాకు తెలియదు. కానీ అక్కడే ఉంటారని అనుకుంటున్నా. అతను చెబితే వచ్చి వీళ్లు తీసుకున్నారా? లేక వాళ్లకు వాళ్లే స్వయంగా తీసుకున్నారో కూడా తెలియదు. ఈ విషయంపై మొదట పోలీసులకు ఫిర్యాదు చేయాలనుకోలేదు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఫోన్ చేయించి ఇలాంటివి మంచిది కాదు తిరికి ఇచ్చేయండి అని చెప్పించాను. ఒకవేళ నేను నేరుగా పోలీసుల దగ్గరకు వెళ్లి ఉంటే గొడవ పెద్దది అయ్యేది. అనవసరంగా ఎందుకని ఊరుకున్నా.

మాకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చే వార్తలు, పోస్టులను మా టీమ్ ఎప్పటికప్పుడు గమనిస్తుంది. అలా మే 18కి వచ్చి ఓ పోస్ట్ చూశాను. అది కన్నప్ప గురించి వచ్చింది. అప్పుడు పోలీసులకు చెప్తే ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేయండి యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అంతకు ముందే వారం కిందట ఈ విషయం నాన్నకు కూడా చెప్పాను. మనోజ్ పేరు బయటకు తీసుకురాకూడదని చాలా బాధపడ్డారు. కానీ త్వరలోనే అసలు నిజాలు బయటకు వస్తాయి. అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురాకపోయినా పర్వాలేదు. చెడ్డపేరు మాత్రం తీసుకురాకూడదు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Next Story