- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆ రూల్ పెడితే ఓటీటీ చచ్చిపోతుంది: మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
జీవితంలో ఎదగాలంటే ప్రతి మనిషికి చాలా ఓపిక ఉండాలి.

దిశ, సినిమా: ‘జీవితంలో ఎదగాలంటే ప్రతి మనిషికి చాలా ఓపిక ఉండాలి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్‌లో ఉన్నవారికి అది మరింత ఎక్కువ కావాలి’ అని చెప్తున్నాడు మనోజ్ బాజ్‌పాయ్. ఆయన నటించిన లేటెస్ట్ మూవీ ‘ది సిర్ఫ్ ఏక్ బందా కాఫీ హై’ ప్రమోషన్స్‌లో భాగంగా కెరీర్ అనుభవాలపై మాట్లాడుతూ.. ‘చేసిన పాత్రలే మళ్లీ చేస్తే జనాలకు బోర్ కొడుతుంది. అందుకే నేను భిన్నంగా నటించేందుకు ప్రయత్నిస్తా. ఇందులో కొత్తగా ట్రై చేశా. నా కెరీర్లో ఎన్నో ఎత్తుపల్లాలు చూశా. దేనికోసం నిరుత్సాహ పడలేదు. నా నటనతో మరో నాలుగు తరాల ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడాన్ని ఇష్టపడతా. దీనికి అవసరమైన బలం, సహనం, నమ్మకం అన్నీ దేవుడు అందిస్తున్నాడు. అభిమానులు ప్రోత్సహిస్తున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు. చివరగా కొవిడ్ ఎఫెక్ట్ వల్ల ఓటీటీలకు ఆదరణ పెరిగిందన్న ఆయన.. సెన్సార్ వస్తే మాత్రం ఓటీటీ వ్యవస్థ తప్పకుండా చచ్చిపోతుందంటూ ఆసక్తికరంగా పలు విషయాలు చెప్పుకొచ్చాడు.
Also Read: రెండో పెళ్లిపై సమంత గుడ్ న్యూస్ చెప్పనుందా..? అతడితో కలిసి ఇంప్రెస్ చేస్తానని పోస్ట్






