‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-05-12 16:02:39  IST  )

ఎల్రెడ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘మండాడి’ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

‘మండాడి’ రిలీజ్ డేట్ ఫిక్స్
X

దిశ, సినిమా: కోలీవుడ్ విలక్షణ నటుడు సూరి, టాలీవుడ్ వెర్సటైల్ హీరో సుహాస్ కలయికలో రాబోతున్న క్రేజీ మల్టీస్టారర్ ‘మండాడి’. మతిమారన్ పుగళేంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం మత్స్యకారుల జీవితాల నేపథ్యంలో సాగే ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. నటుడు సూరి ఇప్పటికే ‘విడుతలై’ వంటి చిత్రాలతో తన నటనా విశ్వరూపాన్ని చూపించగా, తెలుగులో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న సుహాస్ ఈ చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించడం విశేషం. వీరిద్దరి కలయిక సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ఈ సినిమాలో మహిమా నంబియార్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సీనియర్ నటుడు సత్యరాజ్, రవీంద్ర విజయ్ వంటి హేమాహేమీలు ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతం అందిస్తున్నారు. ఎల్రెడ్ కుమార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమాను ఆగస్ట్ 13న థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు టాక్.

‘ది ప్యారడైజ్’ రీషూట్ అంటూ వార్తలు.. హెచ్చరిక జారీ చేస్తూ కీలక ప్రకటన చేసిన మూవీ టీమ్

Next Story