Manchu Vishnu: సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-28 14:32:24  IST  )

డైనమిక్ హీరో మంచు విష్ణు(manchu vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa).

Manchu Vishnu: సంచలనంగా మారిన మంచు విష్ణు కామెంట్స్.. దారుణంగా ట్రోల్ చేస్తున్న నెటిజన్లు
X

దిశ, సినిమా: డైనమిక్ హీరో మంచు విష్ణు(manchu vishnu) ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కన్నప్ప’(Kannappa). షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ప్రమోషన్స్ స్టార్ట్ చేసిన మూవీ టీమ్ వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. అంతేకాకుండా అప్డేట్స్ విడుదల చేస్తూ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచుతున్నారు. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మంచు విష్ణు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్ సినిమా అంటే నాకు చాలా ఇష్టం. కన్నప్ప కూడా నా పరంగా అలాంటి మూవీనే. అలాగే నేను హార్డ్ కోర్ హిందువుని. నా భార్య క్రిస్టియన్. ఆమె రోజు మా ఇంట్లో బైబిల్ చదువుతుంది.

అంతేకాకుండా నేను నిద్రపోయేటప్పుడు నా తలగడ కింద బైబిల్ ఉంచుతుంది. నాలోని ఏవైనా దుష్టశక్తులు ఉంటే వెళ్లిపోతాయని ఆమె నమ్మకం. దేవుడు అన్నిచోట్ల ఉంటాడు. కాకపోతే గుడికి వెళ్తేనే మనశ్శాంతి దొరుకుతుందని అంతా నమ్ముతారు. కన్నప్ప సినిమాలో క్లైమాక్స్ ఒక్కటే అయినా అంతకు ముందు సన్నివేశాలను మాత్రం ఎవరికి వాళ్ల ఊహలకు తగ్గట్లు తెరకెక్కించారు’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు ఆయనను దారుణంగా ట్రోల్ చేస్తు్న్నారు. బూతులు తిడుతూ మీమ్స్ కూడా షేర్ చేస్తున్నారు.హార్డ్ కోర్ హిందువు అయితే నెత్తికింద బైబిల్ ఎలా పెట్టుకున్నావుగా గొర్రె అని కామెంట్లు పెడుతున్నారు. కాగా, ముఖేష్ కుమార్ దర్శకత్వంలో రాబోతున్న ‘కన్నప్ప’ను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, మోహన్ లాల్, బ్రహ్మానందం వంటి స్టార్స్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

Twitter link

‘కన్నప్ప’ సినిమాపై ఆర్జీవీ రియాక్షన్.. అసహ్యించుకునే సీన్‌లో మంచు విష్ణు.. షాకింగ్ ట్వీట్ వైరల్

'Kannappa' Box Office Collection Day 1: కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్స్ ?

Next Story