‘కన్నప్ప’ సినిమాపై ఆర్జీవీ రియాక్షన్.. అసహ్యించుకునే సీన్‌లో మంచు విష్ణు.. షాకింగ్ ట్వీట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-28 12:50:18  IST  )

ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ వాంటెడ్ మూవీ ‘కన్నప్ప’(Kannappa).

‘కన్నప్ప’ సినిమాపై ఆర్జీవీ రియాక్షన్.. అసహ్యించుకునే సీన్‌లో మంచు విష్ణు.. షాకింగ్ ట్వీట్ వైరల్
X

దిశ, సినిమా: ముఖేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో వచ్చిన మోస్ట్ వాంటెడ్ మూవీ ‘కన్నప్ప’. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కించిన ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్స్‌పై మోహన్ బాబు(Mohan Babu) నిర్మించారు. అయితే ఇందులో అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మోహన్ బాబు, ప్రభాస్(Prabhas), శరత్ కుమార్(Sharath Kumar), కాజల్ అగర్వాల్, అరియానా, వివియానా, మంచు విష్ణు(Manchu vishnu), అవ్రామ్, మధుబాల, బ్రహ్మానందం, కీలక పాత్రలో నటించారు. అయితే ఈ సినిమా భారీ అంచనాల మధ్య జూన్ 27న గ్రాండ్‌గా విడుదలైంది. ఇక ఈ మూవీ చూసిన నెటిజన్లు కొందరు పాజిటివ్ రివ్యూల్ ఇస్తుంటే మరికొందరు మాత్రం నెగెటివ్‌గా స్పందిస్తున్నారు. మొత్తానికి కన్నప్ప బాక్సాఫీసు వద్ద మెప్పించలేక మిక్స్‌డ్ టాక్‌తో ట్రోల్స్‌ను కూడా ఎదుర్కొంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా వాట్సాప్ చాట్ లీక్ చేశాడు.

ఇక అందులో ఆర్జీవీ ‘కన్నప్ప’పై ప్రశంసలు కురిపించిన మెసేజ్ ఉంది. అసలు అందులో ఏముందంటే.. ‘‘మొదటగా నాకు దేవుళ్లు, భక్తులు ఇద్దరినీ కలిపి చూపించే సినిమాలు నచ్చవు. అందుకే అలాంటి ఇతివృత్తంతో వచ్చిన చిత్రాలను ఎప్పుడూ చూడను. నా కాలేజీ రోజుల్లో సినిమాలు నాలుగు సార్లు చూశా అది కూడా హీరో, హీరోయిన్, పాటల కోసం చూశా. కానీసబ్జెక్ట్ కోసం మాత్రం కాదు. తిన్నడుగా మీరు కేవలం నటించడం మాత్రమే కాదు ప్రధాన పూజారిలా నమ్మకంతో దేవాలయాన్ని మూర్వీభవించారు. మీ నటనతో నన్ను ఊపిరి ఆడకుండా చేసి క్రూరత్వాన్ని ప్రదర్శించారు. క్లైమాక్స్‌లో, శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్ళను అదించే చోట మీరు హృదయ విదారకమైన నటనతో ఉన్నత స్థాయికి చేరుకున్నారు.

ఇది ఒక నాస్తికుడిగా నేను అసహ్యించుకునే సన్నివేశం కానీ మంచు విష్ణు నటన నన్ను ప్రేమించేలా చేసినందుకు సంతోషంగా ఉన్నాను. మీరు శివుడికి లొంగిపోయినప్పుడు మీ నిజాయితీ మీరు చూపించిన భావోద్వేగం ఒక మాస్టర్ క్లాస్‌లా అనిపించింది. ఆ క్షణాలలో మీ ముఖం భక్తితో కూడిని పెయింటింగ్‌తో కూడినట్లుగా అనిపించింది. అందరూ ఈ సినిమాలో ప్రభాస్‌ను చూడటానికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం మంచు విష్ణును చూడటానికి వెళ్తున్నా’’ అని రాసుకొచ్చారు. ఇక ఈ మెసేజ్‌కు మంచు విష్ణు ‘‘ఇలాంటి మెసేజ్ రావడం అంటే నా కల నిజమైనట్టే. యీ ప్రేమను నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది’’ అని రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. సినిమా చూశాన మీ అభిప్రాయం మార్చుకుంటారంటూ ఆర్జీవీని ట్రోల్ చేస్తున్నారు.

link

Next Story