ఇది నా లైఫ్‌లోనే ఎమోషనల్ మూమెంట్.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ మంచు విష్ణు ఎమోషనట్ ట్వీట్

by Mallepaka Hamsa |

టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(kannappa).

ఇది నా లైఫ్‌లోనే ఎమోషనల్ మూమెంట్.. ఎప్పటికీ గుర్తుండిపోతుందంటూ మంచు విష్ణు ఎమోషనట్ ట్వీట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ హీరో మంచు విష్ణు(manchu vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న సినిమా ‘కన్నప్ప’(kannappa). ఇందులో ప్రీతి ముకుందన్ (preethi mukundan) హీరోయిన్‌గా నటిస్తుండగా.. మోహన్ బాబు(mohan babu), ప్రభాస్, అక్షయ్ కుమార్ (akshay kumar), కాజల్ అగర్వాల్, మంచు విష్ణుతో పాటు ఆయన ముగ్గురు పిల్లలు వివియానా, అరియానా, అవ్రామ్ కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ముకేష్ కుమార్ సింగ్(Mukesh Kumar Singh) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీ జూన్ 27న థియేటర్స్‌లోకి రాబోతుంది. దీంతో మూవీ మేకర్స్ నెల రోజుల ముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేసి పలు ప్రాంతాల్లో ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా ‘కన్నప్ప’ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ విడుదల చేస్తూ హైప్ పెంచుతున్నారు.

ఈక్రమంలో.. తాజాగా, మంచు విష్ణు ట్విట్టర్ ద్వారా ఓ ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ ఎమోషనల్ క్యాప్షన్ జత చేశారు. ‘‘కన్నప్పతో నా కొడుకు ఇండస్ట్రీకి పరిచయం కాబోతున్నాడు. తను సెట్‌లోకి అడుగుపెట్టడం కెమెరా ముందు నిల్చొని డైలాగ్స్ చెప్పడం ఇలాంటివన్నీ నా జీవితంలో భావోద్వేగ భరితమైన క్షణాలు. ఒక తండ్రిగా, ఒకప్పుడు కలలుగన్న అదే ప్రపంచంలోకి నా తనయుడు రావడం చూస్తుంటే మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది. దానికి ఏటీ సాటిరాదు. ఇది కేవలం ఎంట్రీ మాత్రమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయే మధుర జ్ఞాపకం. నాపై చూపించిన ప్రేమాభిమానాలనే నా కుమారుడిపైనా చూపిస్తారని అనుకుంటున్నా. అవ్రామ్ ప్రయాణం మొదలైంది. అది కూడా కన్నప్పతోనే ప్రారంభించాడు’’ అని రాసుకొచ్చాడు. అంతేకాకుండా అవ్రామ్ షూటింగ్‌కు సంబంధించిన వీడియో షేర్ చేయడంతో అది కాస్త నెటిజన్లు ఫిదా అయ్యేలా చేస్తుంది.

Twitter link

Next Story