పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు.. లడ్డూ ఇష్యూపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు

by Gantepaka Srikanth |   (  Updated:2024-09-29 12:43:28  IST  )

తిరుపతి లడ్డూ(Tirupati Laddu) వివాదంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు.

పవన్ కల్యాణ్ చాలా స్పష్టంగా మాట్లాడారు.. లడ్డూ ఇష్యూపై మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తిరుపతి లడ్డూ(Tirupati Laddu) వివాదంపై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు(Manchu Vishnu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విష్ణు హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. లడ్డూ అంశం చాలా సున్నితమైదని.. దీని గురించి డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చాలా క్లియర్‌గా మాట్లాడారని అన్నారు. తాను కూడా తిరుపతికి చెందిన వాడినే అని అన్నారు. ఇక్కడ ఎవరికీ కమ్యూనిటీ ఫీలింగ్‌ లేదని తెలిపారు. జానీ మాస్టర్ వ్యవహారాన్ని ఫిల్మ్ ఛాంబర్ చూసుకుంటుందని చెప్పారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో తిరుమల క్షేత్రాన్ని.. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అపవిత్రం చేశారని.. తిరుపతి లడ్డూ తయారీలో జంతువుల కొవ్వును ఉపయోగించారని ల్యాబ్ టెస్ట్‌ల్లో వెల్లడైందని.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత కొన్ని రోజులుగా వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే దేశవ్యాప్తంగా పెను దుమారం రేపుతుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయంగా తీవ్ర విమర్శలు, ప్రతివిమర్శలకు తావిస్తోంది. ఇప్పటికే ఈ అంశంపై ప్రభుత్వం విచారణకు సైతం ఆదేశించింది.

Next Story