'కన్నప్ప' నుంచి తప్పుకున్న హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు

by Disha Web Desk 10 |
కన్నప్ప నుంచి తప్పుకున్న హీరోయిన్.. క్లారిటీ ఇచ్చిన మంచు విష్ణు
X

దిశ, వెబ్ డెస్క్: ఎట్టకేలకు భారీ బడ్జెట్ తో మన మంచు పెద్ద బాబు సినిమా తీస్తున్నారని సంతోషిస్తున్న సమయంలో సినిమా షూటింగ్ కూడా మొదలవ్వకుండానే పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. మంచు విష్ణు నిర్మాణంలో రూపొందుతోన్న ‘కన్నప్ప’ సినిమా నుంచి హీరోయిన్ నుపుర్ సనన్ తప్పుకున్నారు. ఈ విషయాన్ని మంచు విష్ణు స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. "షెడ్యూల్స్ కారణంగా కన్నప్ప మూవీ నుంచి నుపుర్ సనన్ తప్పుకుంటున్నట్టు చెప్పడానికి బాధగా ఉంది. మేము ఆమెను మిస్ అవుతున్నాం.. కానీ మా కొత్త హీరోయిన్ కోసం వేట మొదలుపెట్టాం.. నూపూర్‌ చేస్తున్న సినిమాలు మంచి విజయాలు అందుకోవాలని, అవకాశం వస్తే.. భవిష్యత్తులో కలిసి పనిచేయాలని ఆశిస్తున్నానని" ట్వీట్‌లో మంచు విష్ణు పేర్కొన్నారు.

Next Story

Most Viewed