మెగా హీరో సినిమాలో మంచు మ‌నోజ్ విల‌న్‌.. ఇక థియేట‌ర్లు బ్లాస్టే ?

by velandi.Saikiran |

మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా.... విలన్ పాత్రకు సై అంటున్నారట మనోజ్. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే బాబీ దర్శకత్వంలో

మెగా హీరో సినిమాలో మంచు మ‌నోజ్ విల‌న్‌.. ఇక థియేట‌ర్లు బ్లాస్టే ?
X

దిశ‌, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు కుటుంబానికి ఉన్న పాపులారిటీ అంతా కాదు. మంచు మోహన్ బాబు నటుడిగా అలాగే నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతుంటే... ఆయన కుమారులు మంచు మనోజ్, విష్ణులు కూడా దూసుకు వెళ్తున్నారు. ముఖ్యంగా మంచు మనోజ్ మాత్రం నెగిటివ్ రోల్ లో కనిపిస్తూ సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇటీవల ఇదే తరహాలో మిరాయ్ సినిమాలో కనిపించి అందరినీ ఆకట్టుకున్నారు.

తన తండ్రి లాగా నెగిటివ్ రోల్ చేసి.. దుమ్ము లేపుతున్నారు మంచు మనోజ్. ఇక లేటెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి సినిమాలో కూడా.... విలన్ పాత్రకు సై అంటున్నారట మనోజ్. మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే బాబీ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని కెమెరామెన్ గా పనిచేయబోతున్నారట. అయితే ఇందులో బలమైన విలన్ పాత్ర‌ ఉంటుందట. దానికోసం మంచు మనోజ్ ను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆఫర్ కు మంచు మనోజ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అని సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే థియేటర్లు బ్లాస్ట్ కావడం గ్యారెంటీ అంటున్నారు మెగా అభిమానులు.

Next Story