Manchu Manoj: మంచు మనోజ్ గొప్ప మనసు.. ‘కన్నప్ప’ సినిమాపై ఆసక్తికర ట్వీట్ పెట్టి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-26 09:46:48  IST  )

గత కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల పంచాయతీ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు.

Manchu Manoj: మంచు మనోజ్ గొప్ప మనసు.. ‘కన్నప్ప’ సినిమాపై ఆసక్తికర ట్వీట్ పెట్టి బిగ్ ట్విస్ట్ ఇచ్చాడుగా..!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే. అన్నదమ్ముల పంచాయతీ రోజు రోజుకి పెరుగుతుంది తప్ప తగ్గడం లేదు. ఇక మంచు మనోజ్ మోహన్ బాబు ఇంటి నుంచి వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు మనోజ్ అయితే అన్నతో విబేధాలు ఉన్నప్పటికీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ‘కన్నప్ప’(Kannappa) సినిమాపై రియాక్ట్ అయ్యారు. ఈ మేరకు ట్విట్టర్ ద్వారా ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. ‘‘కన్నప్ప చిత్ర బృందానికి నా తరపున ఆల్ ది బెస్ట్ తెలియజేస్తున్నాను. ఈ చిత్రం కోసం మా నాన్న, టీమ్ ఎన్నో ఏళ్లు ఎంతో శ్రమను ప్రేమను పెట్టారు. ఇది బ్లాక్ బస్టర్ హిట్ కావాలని నేను ప్రార్థిస్తున్నాను. మా లిటిల్ ఛాంప్స్ అరి, వివి, అవ్రామ్‌ల అందమైన జ్ఞాపకాలను బిగ్ స్క్రీన్‌పై చూడాలని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నా.

మంచి మనసున్న ప్రభాస్(Prabhas) లెజెండరీ నటులు మోహన్ లాల్(Mohanlal) గారు, అక్షయ్ కుమార్(Akshay Kumar) గారు, ప్రభుదేవా గారు ఇలా ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే తనికెళ్ల భరణి గారి జీవితకాలం కల జీవం పోసుకుని, శుక్రవారం జూన్ 27న ‘కన్నప్ప’ విడుదల అవుతుండటం సంతోషంగా అనిపిస్తుంది. వీళ్లంతా ఈ మూవీ కోసం చేసిన సాయం, చూపించిన ప్రేమ నమ్మకం ఎంతో గొప్పవి. ఎప్పుడెప్పుడు సినిమా చూస్తానా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. ఈ ప్రయాణానికి ఆ పరమేశ్వరుని ఆశీస్సులు, ప్రేమ ఉండాలని కోరుకుంటున్నా’’ అని రాసుకొచ్చారు.

అలాగే మోహన్ బాబు, మంచు విష్ణు ముగ్గురు పిల్లలు అరియానా, వివియానా, అవ్రామ్ పోస్టర్లు షేర్ చేశారు. కానీ తన అన్నయ్య మంచు విష్ణు పేరును మాత్రం ఎక్కడా ప్రస్తావించకుండా బిగ్ ట్విస్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా, ఈ సినిమా మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతుండగా.. దీనిని ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కించారు. ఇక ఈ చిత్రాన్ని అవా ఎంటర్‌టైన్‌మెంట్స్, 24 ఫ్రేమ్స్ బ్యానర్‌పై మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా రేపు జూన్ 27న థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.

లింక్

Next Story