షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మంచు మనోజ్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ ఆసక్తికర పోస్ట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-11-22 07:13:21  IST  )

స్టార్ హీరో మోహన్‌బాబు తనయుడిగా వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్(Manchu Manoj) ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు.

షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన మంచు మనోజ్.. కొత్త ప్రయాణం మొదలైందంటూ ఆసక్తికర పోస్ట్
X

దిశ, సినిమా: స్టార్ హీరో మోహన్‌బాబు తనయుడిగా వచ్చి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మంచు మనోజ్(Manchu Manoj) ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నాడు. తన కుటుంబంలో గొడవలు జరుగుతుండటంతో మొత్తం తన భార్య పిల్లలతోనే సమయాన్ని గడుపుతున్నాడు. ఇక చాలా రోజుల తర్వాత ఇటీవల ‘భైరవం’ సినిమాతో ఇండస్ట్రీకి రీ ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. అలాగే తేజ సజ్జా హీరోగా నటించిన ‘మిరాయ్’లో కీలక పాత్రలో నటించారు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుని మంచు మనోజ్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేశాడు. ఈ రెండు మూవీస్ ఆయన జీవితాన్నే మార్చేశాయనడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు మంచి అవకాశాలు వస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం మంచు మనోజ్ మెగాస్టార్ సినిమాలో చాన్స్ అందుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో చిరు హీరోగా చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మంచు మనోజ్ విలన్‌గా కనిపించబోతున్నట్లు టాక్.

ఓ వైపు పర్సనల్ లైఫ్‌ను మరోపక్క ప్రొఫెనల్ లైఫ్‌ను సక్సెస్‌ఫుల్‌గా కొనసాగిస్తున్నాడు. అలాగే సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటున్నారు. పలు సినిమా ఈవెంట్లలో గెస్ట్‌గా పాల్గొంటున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా, మంచు మనోజ్ కొత్త ప్రయాణం ప్రారంభించినట్లు ట్విట్టర్ ద్వారా ప్రకటించి ట్విస్ట్ ఇచ్చాడు. వరుస సినిమాలు చేస్తాడనుకుంటే.. మోహన రాగా పేరుతో ఓ మ్యూజిక్ సంస్థను స్టార్ట్ చేసినట్లు తెలుపుతూ.. సంగీతం ఎప్పుడూ తన ప్రయాణాన్ని అభివృద్ధి చెందేలా చేస్తుందని అన్నాడు. అలాగే ప్రతిభను ప్రోత్సహించడం కోసమే మొదలెట్టినట్లు తెలుస్తోంది. లోకల్ హార్ట్స్, గ్లోబల్ బీట్స్ అనే క్యాప్షన్ జత చేశాడు. ఇక ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు కొత్త ప్రయాణాన్ని ప్రారంభించినందుకు ఆల్ ది బెస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

link

Next Story