- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్‌సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఆకట్టుకుంటున్న మంచు మనోజ్ పెళ్లి వీడియో.. ఫ్యాన్స్ ఎమోషనల్
దిశ, సినిమా: 2023 మార్చి 03న నటుడు మంచు మనోజ్, భూమా మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ కల్యాణం ఫిల్మ్ నగర్‌లో ఉన్నటువంటి మంచు లక్ష్మీ ప్రసన్న నివాసంలో ఇరువురి కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వైభవంగా జరిగింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు కూడా చాలా వైరల్ అయ్యాయి. అయితే తాజాగా తన పెళ్లిపై చేసిన ఓ స్పెషల్ వీడియోను మనోజ్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. ఈ వీడియోలో మనోజ్-మౌనిక ప్రీ వెడ్డింగ్ షూట్ నుంచి మెహందీ, పెళ్లి, రిసెప్షన్ వరకు మొత్తం కవర్ చేశారు. ‘ఏం మనసో.. ఏం వరసో’ అంటూ సాగిన ఈ పాట లిరిక్స్‌ను ప్రముఖ గేయ రచయిత అనంత శ్రీరామ్ రాయడం విశేషం. ఇక వీడియో మొత్తంలో ఇద్దరూ చాలా ఆనందంగా కనిపించారు. అలాగే గొడవల కారణంగా అన్నయ్య మంచు విష్ణు రాలేదన్నారు. కానీ, ఈ వీడియోలో విష్ణు కూడా కనిపించాడు. అతని పిల్లలు కూడా సందడి చేశారు.
ఇవి కూడా చదవండి: యాదాద్రి: 50 పాఠశాలలను దత్తత తీసుకున్న మంచు లక్ష్మి