Manchu Lakshmi: ఎయిరిండియా ఫ్లైట్‌లో వెళ్లిన మాట వాస్తమే.. దేవుడి దయవల్ల బతికిపోయామంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్

by Mallepaka Hamsa |   (  Updated:2025-06-14 15:30:37  IST  )

ఇటీవల ఎవ్వరూ ఊహించని విధంగా గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది.

Manchu Lakshmi: ఎయిరిండియా ఫ్లైట్‌లో వెళ్లిన మాట వాస్తమే.. దేవుడి దయవల్ల బతికిపోయామంటూ మంచు లక్ష్మి ఎమోషనల్ ట్వీట్
X

దిశ, సినిమా: ఇటీవల ఎవ్వరూ ఊహించని విధంగా గుజరాత్‌(Gujarat)లోని అహ్మదాబాద్ (Ahmedabad)నుంచి లండన్‌కు బయల్దేరిన ఎయిరిండియా విమానం ఎయిర్‌పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో ఎంతోమంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. దాదాపు 241మంది చనిపోగా.. ఇందులో ప్రయాణించిన ఒకే ఒక ప్రయాణికుడు లక్కీగా ప్రాణాలతో బయటపడ్డాడు. ఇక అదే రోజు మంచు లక్ష్మి కూడా ఎయిరిండియా ఫ్లైట్‌లో లండన్‌కు వెళ్లింది. దీంతో ఆమె ప్రమాదం జరిగిన ఫ్లైట్‌లో ఉందేమోనని అభిమానులు, నెటిజన్లు ఆమె ఎలా ఉందో అని ఆందోళనగా తెగ మెసేజ్‌లు పెడుతున్నారు. తాజాగా, మంచు లక్ష్మి(manchu Lakshmi) ట్విట్టర్ ద్వారా స్పందించి తాను క్షేమంగా ఉన్నట్లు తెలిపింది.

ఈ మేరకు ‘‘నేను ఎలా ఉన్నానో అని కనుక్కోవడం కోసం నాకు చాలా మంది ఫోన్లు చేయడంతో పాటు మెసేజ్‌లు చేస్తున్నారు. అయితే నేను మా, పాప అదే రోజు ముంబయి నుంచి లండన్‌కు ఎయిరిండియా విమానంలోనే వచ్చాము. ఆ దేవుడి దయ వల్ల మేము సేఫ్‌గా చేరుకున్నాము. అక్కడికి వెళ్లిన వెంటనే ఈ ప్రమాదం గురించి తెలిసి నేను ఉలిక్కిపడ్డాను. ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోవడం నిజంగా చాలా బాధాకరం. విద్యార్థులు కూడా మృతిచెందారని తెలిసి నా హృదయం ముక్కలైంది. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన ప్రాణాలు క్షణంలో ముగిసిపోతాయని అనడానికి ఈ ప్రమాదం ఒక ఉదాహరణ. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను’’ అని రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. అవి చూసిన నెటిజన్లు మీ అదృష్టం బాగుందని అంటున్నారు.

Next Story