రాత్రి పడుకోబోయే ముందు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి

by Disha Web Desk 9 |
రాత్రి పడుకోబోయే ముందు ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇచ్చిన మంచు లక్ష్మి
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాలో కెరీర్ ప్రారంభించిన మంచు మోహన్ బాబు కుమార్తె.. మంచు లక్ష్మి టాలీవుడ్ ఇండస్ట్రీకి వచ్చి హీరోయిన్‌గా పలు సినిమాల్లో నటించింది. ‘గుండెల్లో గోదారి’ లక్ష్మీ బాంబ్, దొంగాట, వైఫ్ ఆఫ్ రామ్ వంటి చిత్రాల్లో ముఖ్య పాత్రలు పోషించిన ఈ భామకు తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో కొన్నాళ్లు బుల్లితెర షోల్లో హోస్ట్‌గా వ్యవహరించింది. ప్రస్తుతం లక్ష్మి ‘అగ్ని నక్షత్రం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఓ సినిమాలో నటిస్తోంది.

ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో ఆరబోసే అందాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముంబయి హీరోయిన్స్ రేంజ్‌లో రెచ్చిపోయి స్కిన్ షో చేస్తుందంటూ మోహన్ బాబు ఫ్యాన్స్ ఇంతకుముందు మండిపడ్డ విషయం తెలిసిందే. కానీ మంచు లక్ష్మి ఫోటో షూట్స్‌పై ఎన్ని విమర్శలు వచ్చినా ఆమె అస్సలు పట్టించుకోరు. ఇకపోతే ఈ అమ్మడు 40 ఏళ్లు దాటుతున్న హీరోయిన్ కావాలన్న కాంక్షను ఇంకా వదల్లేదని తన లేటెస్ట్ ఫొటోలు చూస్తే అర్థమైపోతుంది. తాజాగా షార్ట్స్, టాప్ ధరించిన సూపర్ గ్లామరస్‌గా ఉన్న కొన్ని బోల్డ్ ఫొటోలను నెట్టింట పంచుకుంది. ‘రాత్రి పడుకోబోయే ముందు తన ఫ్యాన్స్‌కు ఇలా ట్రీట్ ఇచ్చిందేంట్రా బాబు’ అంటూ పలువురు బోల్డ్ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.




Next Story

Most Viewed