- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంచు లక్ష్మి గ్యాంగ్ రెడీ.. ‘లేచింది మహిళా లోకం’ ట్రైలర్ డేట్ ఫిక్స్!
నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్‌లో విలక్షణ నటనకు కేరాఫ్ అడ్రస్ మోహన్ బాబు తనయ, మల్టీ టాలెంటెడ్ మంచు లక్ష్మి(Manchu Lakshmi)ప్రధాన పాత్రలో నటిస్తున్న సరికొత్త చిత్రం ‘లేచింది మహిళా లోకం’(LechindhiMahilaLokam). పేరుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో టాలీవుడ్‌లోని క్రేజీ లేడీ గ్యాంగ్ అంతా ఒక్కటై సత్తా చాటేందుకు సిద్ధమైంది. అనన్య నాగళ్ల(Ananya Nagalla), హరి తేజ, శ్రద్ధా దాస్, హేమ సోషల్ మీడియా సెన్సేషన్ సుప్రిత వంటి పవర్‌ఫుల్ యాక్టర్స్ ఈ మూవీలో భాగం కావడంతో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ చిత్ర బృందం ప్రేక్షకులకు అదిరిపోయే అప్‌డేట్ ఇచ్చింది. ఈ సినిమాకి సంబంధించిన అఫీషియల్ ట్రైలర్ విడుదల తేదీని అనౌన్స్ చేస్తూ ఒక స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
మార్చి 9న ఉదయం 11:07 గంటలకు ఈ ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లు తెలిపారు. ఈ పోస్టర్ చూస్తుంటే, సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, వారు తిరగబడితే ఎలా ఉంటుందనే ఇంట్రెస్టింగ్ పాయింట్‌తో దర్శకుడు అర్జున్ ఈ సినిమాను తెరకెక్కించినట్లు అర్థమవుతోంది. హిమ రాజశేఖర్, సీతమహి, నిరోషి నవీన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రతిభావంతులైన నటీమణులు అందరూ కలిసి ఒకే స్క్రీన్‌పై కనిపిస్తుండటంతో, ఇది ఒక కంప్లీట్ ఉమెన్ ఎంపవర్‌మెంట్ యాక్షన్ డ్రామాగా ఉండబోతోందని నెటిజన్లు. ముఖ్యంగా మంచు లక్ష్మి మార్క్ పవర్‌ఫుల్ డైలాగ్స్ ఈ సినిమాకు హైలైట్ కానున్నాయని టాక్.






