ఇక ఊరుకునేది లేదు రకుల్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తానంటూ మంచు లక్ష్మీ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?

by Mallepaka Hamsa |

స్టార్ కిడ్ మంచు లక్ష్మి(manchu laxshmi) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీకి చెందిన వారందరితో పరిచయాలున్నాయి.

ఇక ఊరుకునేది లేదు రకుల్‌కు స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇస్తానంటూ మంచు లక్ష్మీ కామెంట్స్.. అసలేం జరిగిందంటే?
X

దిశ, సినిమా: స్టార్ కిడ్ మంచు లక్ష్మి(manchu laxshmi) చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ ఇండస్ట్రీకి చెందిన వారందరితో పరిచయాలున్నాయి. ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), రకుల్ ప్రీత్‌సింగ్ (Rakul Preet Singh)వంటి హీరోయిన్లతో పాటు మరికొందరు ఈమెకు క్లోజ్ ఫ్రెండ్స్ అన్న విషయం తెలిసిందే. నిత్యం వెకేషన్లకు వెళ్తూ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటారు. అవి కాస్త సోషల్ మీడియాలో అతి తక్కువ సమయంలోనే వైరల్ అవుతుంటాయి. కానీ గత కొద్ది కాలంగా ఈ ముగ్గురు ఎవరి లైఫ్‌లో వాళ్లు ఫుల్ బిజీగా ఉండటం వల్ల ట్రిప్పులకు వెళ్లడం లేదు. ఇటీవల ఒకేచోట కనిపించిన దాఖలాలు కూడా లేవు. దీంతో వీరి మధ్య గొడవలు వచ్చినట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈక్రమంలో.. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో భాగంగా మంచు లక్ష్మి రకుల్‌కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వాల్సిన సమయం వచ్చిందని చెప్పింది. ‘‘మా ఇద్దరి జీవితాల్లోనూ చాలా మార్పు వచ్చింది. నేను ముంబైకి మకాం మార్చాను. రకుల్ పెళ్లి చేసుకుని ఎంజాయ్ చేస్తోంది. మా ఇద్దరి జీవితాల్లో మార్పు సహజం. నాకంటే రకుల్ పూర్తిగా మారిపోయింది. చిన్న ప్లాన్‌ను అయినా తన భర్తకు చెప్తుంది. నేను జాకీని అడిగి చెప్తా అంటుంది. ఎప్పుడూ ఏం అడిగినా పదే పదే ఆమె భర్తకు చెప్పాలని చెప్తుంది. ఇది కొత్తగా పెళ్ళైన వారిలో కనిపించే విషయం కాబట్టి మరో ఏడాది పాటు ఓపికపడతాను. ఆ తర్వాత ఖచ్చితంగా స్ట్రాంగ్‌గానే దండిస్తా. వార్నింగ్ కూడా ఇస్తాను’’ అని సరదాగా చెప్పింది.

Next Story