నటిపై కన్నేసిన క్యాబ్‌ డ్రైవర్.. సిగ్నల్ దాటగానే అలా చేస్తూ

by Mallepaka Hamsa |   (  Updated:2022-10-17 08:04:13  IST  )

ప్రముఖ మరాఠీ నటి, దర్శకురాలు మానవా నాయక్.. తనకు భయంకరమైన సంఘటన ఎదురైనట్లు తెలిపింది. ఆదివారం రాత్రి ఉబర్ డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేశాడని ఎమోషనల్ అయింది.. Latest Telugu News

నటిపై కన్నేసిన క్యాబ్‌ డ్రైవర్.. సిగ్నల్ దాటగానే అలా చేస్తూ
X

దిశ, సినిమా : ప్రముఖ మరాఠీ నటి, దర్శకురాలు మానవా నాయక్.. తనకు భయంకరమైన సంఘటన ఎదురైనట్లు తెలిపింది. ఆదివారం రాత్రి ఉబర్ డ్రైవర్ తనతో దురుసుగా ప్రవర్తించాడని, ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతూ భయాందోళనకు గురిచేశాడని ఎమోషనల్ అయింది. ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్న ఆమె.. 'ఉబర్ క్యాబ్‌ బుక్ చేసుకుని పనిమీద బయటకెళ్లాను. ఫోన్‌లో మాట్లాడుతూ డ్రైవ్ చేస్తున్న సదరు డ్రైవర్ బీకేసీ వద్ద సిగ్నల్ కూడా జంప్ చేశాడు. ట్రాఫిక్ పోలీస్ ఆపబోతే తప్పించుకుని క్యాబ్‌ను వేగంగా ముందుకు తీసుకెళ్లాడు. దీంతో కారు ఆపాల్సిందిగా అతడికి చెబితే.. 'జరిమానా రూ.500 నువ్వు ఇస్తావా' అంటూ గొడవపడ్డాడు. ఇంకాస్త దూరం వెళ్లిన తర్వాత తన మనుషులు కొందరిని పిలిచి ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నించాడు. భయంతో గట్టిగా అరవడంతో చుట్టుపక్కల జనాలు నన్ను అక్కడి నుంచి తీసుకెళ్లారు' అంటూ ట్వీట్‌ చేసింది. అంతేకాదు సదరు డ్రైవర్ ఫొటోతో పాటు క్యాబ్ నెంబర్‌ను కూడా షేర్ చేసింది. కాగా ఈ పోస్ట్‌పై స్పందించిన ముంబై పోలీసులు.. 'మాన్వా జీ, మీకు జరిగిన సంఘటనను చాలా సీరియస్‌గా తీసుకున్నాం. డీసీపీ జోన్ 8 దాని గురించి విచారిస్తోంది. వీలైనంత త్వరగా నిందితుడిని పట్టుకుంటాం' అని హామీ ఇచ్చారు.

ఇవి కూడా చ‌ద‌వండి:

నేషనల్ క్రష్‌పై బాలయ్య ఇంట్రెస్ట్.. క్రష్ అంటూ రెచ్చిపోయిన నటసింహం

Next Story