బంపర్ ఆఫర్ అందుకున్న మానస వారణాసి..

by Mallepaka Hamsa |

తాజా సమాచారం ప్రకారం.. మానసకు కోలీవుడ్‌లో ఒక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది.

బంపర్ ఆఫర్ అందుకున్న మానస వారణాసి..
X

దిశ, సినిమా: అందం, అభినయం కలగలిసిన టాలీవుడ్ యంగ్ సెన్సేషన్, మాజీ మిస్ యూనివర్స్ ఇండియా మానస వారణాసి ఇప్పుడు సౌత్ ఇండియాలో హాట్ టాపిక్‌గా మారారు. ‘దేవకీ నందన వసుదేవ’తో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ, ఇటీవలి బ్లాక్ బస్టర్ ‘కపుల్ ఫ్రెండ్లీ’ సినిమాతో యూత్‌లో విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆమె హవా చూస్తుంటే, మానస బాక్సాఫీసును షేక్ చేయడం ఖాయమనిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం.. మానసకు కోలీవుడ్‌లో ఒక బంపర్ ఆఫర్ తలుపు తట్టింది. ఇటీవలే ‘టూరిస్ట్ ఫ్యామిలీ’ చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న విలక్షణ నటుడు శశికుమార్ సరసన హీరోయిన్‌గా నటించే ఛాన్స్ మానసను వరించింది.

ఈ క్రేజీ ప్రాజెక్టును టాలెంటెడ్ డైరెక్టర్ మణికందన్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో శశికుమార్ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నారు. అటు మాస్ యాక్షన్, ఇటు క్లాస్ ఎమోషన్స్ కలగలిసిన ఈ కథలో మానస పాత్ర చాలా కీలకంగా ఉండబోతోందని టాక్. ఇప్పటికే టాలీవుడ్‌లో వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉన్న ఈ అమ్మడు, ఇప్పుడు తమిళ పరిశ్రమలోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వార్తతో మానస అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఒకేసారి స్టార్ హీరో, పెద్ద డైరెక్టర్‌తో కోలీవుడ్ ప్రయాణం మొదలుపెట్టడం మానస కెరీర్‌లో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అని చెప్పవచ్చు.

Next Story