ఓటీటీలోకి రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-04 11:14:17  IST  )

ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది.

ఓటీటీలోకి రాబోతున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’.. ఎన్ని భాషల్లో స్ట్రీమింగ్ కాబోతుందంటే?
X

దిశ, సినిమా: ఏడాది సంక్రాంతి బరిలో జనవరి 12న విడుదలైన ‘మన శంకర వరప్రసాద్ గారు’ (Mana Shankara Vara Prasad Garu)బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించింది. కేవలం మూడు వారాల్లోనే ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ. 400 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించి, చిరంజీవి (Chiranjeevi)కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. అనిల్ రావిపూడి మార్క్ కామెడీ, చిరు మేనరిజమ్స్ తోడవ్వడంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా విక్టరీ వెంకటేష్ (Venkatesh)గెస్ట్ పాత్ర సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచి, కలెక్షన్ల వర్షం కురిపించింది. థియేటర్లలో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఓటీటీపై సస్పెన్స్ నెలకొంది. డిజిటల్ హక్కులను జీ5 (ZEE5) సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు ఇటీవల అధికారికంగా ప్రకటించింది.

కానీ స్ట్రీమింగ్ తేదీని మాత్రం వెల్లడించలేదు. లేదు మెగా అభిమానులు అయోమయంలో పడిపోయారు.. తాజా సమాచారం ప్రకారం.. ఫిబ్రవరి 11 నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కాబోతున్నట్లు సమాచారం. జీ5 తన అఫీషియల్ యాప్ క్యాటలాగ్‌లో ఈ తేదీని జత చేయడంతో అభిమానుల నిరీక్షణకు తెరపడింది. థియేట్రికల్ రన్ ముగిసిన నాలుగు వారాలకే ఈ సినిమాను డిజిటల్ ఫ్లాట్‌ఫామ్ లోకి తీసుకురావడం విశేషం. ఈ సినిమా కేవలం తెలుగుకే పరిమితం కాకుండా, పాన్-ఇండియా స్థాయిలో డిజిటల్ సందడి చేయనుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ భాషల్లో కూడా ఒకేసారి స్ట్రీమింగ్ కాబోతోందని తెలుస్తోంది. ప్రాంతీయ భాషా చిత్రంగా విడుదలై ఇంత భారీ స్థాయిలో మల్టీ-లాంగ్వేజ్ రిలీజ్ సొంతం చేసుకోవడం మెగాస్టార్ రేంజ్‌ను మరోసారి నిరూపిస్తోంది.

థియేటర్లలో మిస్ అయిన వారికి మరియు మళ్ళీ మళ్ళీ చూడాలనుకునే మెగా అభిమానులకు ఫిబ్రవరి 11న పండగే అని చెప్పాలి. సంక్రాంతి విన్నర్‌గా నిలిచిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం ఉంది. నయనతార నటన, భీమ్స్ సిసిరోలియో అందించిన సంగీతం ఓటీటీ ఆడియన్స్‌ను కూడా ఆకట్టుకుంటాయా? లేదా చూడాలి. ఇక చిరు.. వెంకటేష్‌ను మరోసారి బిగ్‌స్క్రీన్‌పై కలిసి చూసే అవకాశం దక్కనుంది. ఎంచక్కా ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమా చూసేయొచ్చన్నమాట.

వారణాసి’ కథ విన్నప్పుడు చాలా భయపడ్డాను.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

Next Story