‘వారణాసి’ కథ విన్నప్పుడు చాలా భయపడ్డాను.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-04 10:33:59  IST  )

మహేష్ బాబు(Mahesh Babu) – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

‘వారణాసి’ కథ విన్నప్పుడు చాలా భయపడ్డాను.. మహేష్ బాబు షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: మహేష్ బాబు(Mahesh Babu) – దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి(S.S. Rajamouli) కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న అత్యంత ప్రతిష్ఠాత్మక పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా నటిస్తుండగా, మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించనున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ఇదిలా ఉండగా, షూటింగ్‌ను కొనసాగిస్తూనే చిత్ర బృందం వరల్డ్ వైడ్ ప్రమోషన్స్‌కు శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేష్ బాబు ‘వారణాసి’ సినిమాపై ఆసక్తికర విషయాలను వెల్లడించారు. “వారణాసి’ కథను మొదటిసారి విన్నప్పుడు ఈ పాత్రను నేను చేయగలనా లేదా అనే సందేహం వచ్చింది. కొంత భయం కూడా వేసింది. కానీ రాజమౌళి గారు కథను లోతుగా వివరించాక ఆ భయాలన్నీ పోయాయి” అని మహేష్ బాబు తెలిపారు.

ఈ సినిమాలో తన పాత్రకు హుందాతనం చాలా కీలకమని, ముఖ్యంగా శ్రీరాముడిగా కనిపించే సందర్భాల్లో శరీర భాష, నిలబడి మాట్లాడే తీరు వంటి ప్రతి అంశంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నామని చెప్పారు. పాత్రలోకి పూర్తిగా వెళ్లేందుకు దాదాపు ఏడాది పాటు శిక్షణ తీసుకున్నానని, ఇందులో భాగంగా 2–3 నెలలు కలరీ వంటి యుద్ధవిద్యను కూడా నేర్చుకున్నానని ఆయన వెల్లడించారు. అంతేకాదు, రాజమౌళి సూచన మేరకు తన రన్నింగ్ స్టైల్‌ను మార్చుకోవాల్సి వచ్చిందని, కేవలం రెండు నిమిషాల షాట్ కోసం ఆరు నెలల పాటు కఠినమైన ట్రైనింగ్ తీసుకున్నానని చెప్పారు. 6 నెలల ట్రైనింగ్ తర్వాత.. ఆ షాట్‌ను స్క్రీన్‌పై చూసినప్పుడు తనకు ఎంతో సంతోషం కలిగిందని.. ఆ ఒక్క షాట్ కోసం ఆరు నెలలు చేసిన శిక్షణ నిజంగా విలువైనదిగా అనిపించిందంటూ ఎమోషనల్ అయ్యారు. అంతేకాకుండా తన నడక మారింది.. నిలబడే విధానం మారింది.. అన్నీ మారిపోయాయి” అంటూ మహేష్ బాబు చెప్పుకొచ్చారు.

మ‌హేష్ వార‌ణాసి సినిమా రికార్డు..రిలీజ్ కు ముందే రూ.650 కోట్లా ?

Next Story