- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘మన శంకర వరప్రసాద్ గారు’ అప్డేట్.. పవర్ ఫుల్ లుక్ అదుర్స్
మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(mana Shankara VaraPrasad gaaru).

దిశ, సినిమా: మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’(mana Shankara VaraPrasad gaaru). బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్‌తో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన పాత్రలో నటిస్తుండగా.. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా మేకర్స్ సినిమా నుంచి రిలీజ్ చేసిన మెగాస్టార్ చిరంజీవి కొత్త స్టిల్ అదిరిపోయింది. బ్లాక్ సూట్, వైట్ షర్ట్, కళ్లకు డార్క్ గ్లాసెస్‌తో ఒక చేతిలో గన్ పట్టుకుని స్టైలిష్‌గా, పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్న మెగాస్టార్ స్టిల్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే భారీ నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా జనవరి 12న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.






