- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నటుడితో డేటింగ్.. నన్ను దారుణంగా మోసం చేశాడంటూ మమతా మోహన్ దాస్ సంచలన కామెంట్స్
ఒకవైపు నా అనారోగ్యం, మరోవైపు పెళ్లి పెటాకులు అవ్వడం నన్ను మానసికంగా కుంగదీశాయి.

దిశ, సినిమా: టాలీవుడ్ ప్రేక్షకులకు 'యమదొంగ' సినిమాతో సుపరిచితురాలైన మమతా మోహన్ దాస్.. కేవలం నటిగానే కాకుండా సింగర్‌గా కూడా ఆమె తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అయితే, ఆమె కెరీర్ సక్సెస్‌ఫుల్‌గా సాగింది కానీ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం అంతకంటే ఎక్కువ కష్టాలను ఎదుర్కొంది. కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే మమత రెండుసార్లు క్యాన్సర్ బారిన పడింది. 2009లో మొదట క్యాన్సర్ సోకగా, దాన్ని జయించి మళ్ళీ సినిమాల్లోకి వచ్చింది. కానీ 2013లో అది మళ్ళీ తిరగబెట్టింది. ఆ సమయంలోనే ఆమెకు బొల్లి వ్యాధి కూడా సోకింది. ఇన్ని సమస్యలు చుట్టుముట్టినా మమత ఎక్కడా ధైర్యం కోల్పోలేదు. చిరునవ్వుతో ఆ సమస్యలన్నింటినీ ఎదుర్కొని ఇప్పుడు అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది.
ఆ నిజం తెలిసి నేను షాక్ అయ్యా..
తాజాగా ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న మమత.. తన ప్రేమ, పెళ్లి, క్యాన్సర్ పోరాటం గురించి సంచలన విషయాలు బయటపెట్టింది. ‘‘నాకు డేటింగ్, లవ్ వంటి విషయాల్లో పెద్దగా అనుభవం లేదు. కానీ క్యాన్సర్ ఉన్నట్లు తెలిసిన తర్వాత, ఒక సాధారణ మహిళలా నా మనసులోని కోరికలను నెరవేర్చుకోవాలని అనుకున్నాను. ఆ సమయంలో మలయాళంలో ఒక ప్రముఖ నటుడు నన్ను డేటింగ్ చేద్దామని అడిగాడు. మా అమ్మ కూడా ఓకే చెప్పింది. కానీ, అతనికి అప్పటికే వేరే అమ్మాయితో నిశ్చితార్థం అయిందనే విషయాన్ని నా దగ్గర దాచిపెట్టి.. నన్ను దారుణంగా మోసం చేశాడు. ఆ నిజం తెలిసి నేను షాక్ అయ్యాను’’ అంటూ తన చేదు అనుభవాన్ని పంచుకుంది. ఆ తర్వాత మరో వ్యక్తి పరిచయమైనా, అతను ప్రేమ కంటే కెరీర్ ముఖ్యం అని చెప్పడంతో ఆ బంధం కూడా ముగిసిపోయిందని మమత తెలిపింది.
ఆరు నెలలకే విడాకులు..
తన వివాహ బంధం గురించి కూడా మమత ఆసక్తికర విషయాలు చెప్పింది. తన చిన్ననాటి స్నేహితుడు ప్రజిత్‌ను అతని సోదరి పెళ్లిలో కలిశానని, ఇద్దరం ఇష్టపడి పెళ్లి చేసుకున్నామని.. కానీ కొద్ది రోజులకే విడిపోయామని పేర్కొంది. 2011లో వీరి వివాహం చాలా నిరాడంబరంగా జరిగింది. కానీ, ఏమైందో ఏమో గానీ.. పెళ్లయిన ఆరు నెలలకే వీరిద్దరూ విడిపోయారు. ‘‘ఆ నిర్ణయం తీసుకోవడం నాకు చాలా కష్టమైంది. ఒకవైపు నా అనారోగ్యం, మరోవైపు పెళ్లి పెటాకులు అవ్వడం నన్ను మానసికంగా కుంగదీశాయి’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.






