- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మాలిక్’ ట్రైలర్ అప్డేట్.. మజా రాబోతుందంటూ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), పుల్‌కిత్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాలిక్’(Malik).

దిశ, సినిమా: బాలీవుడ్ హీరో రాజ్ కుమార్ రావు(Raj Kumar Rao), పుల్‌కిత్ కాంబినేషన్‌లో రాబోతున్న లేటెస్ట్ మూవీ ‘మాలిక్’(Malik). ఈ చిత్రాన్ని టిప్స్ ఫిల్మ్స్, లైట్ ఫిల్మ్స్ బ్యానర్స్‌పై కుమార్ తరుణి, జై శవక్రమణి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో రాజ్ కుమార్ రావు మొరటుతనం కలిగిన గ్యాంగ్‌స్టర్ పాత్రలో నటించనున్నారు. యాక్షన్ ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రంగా తెరకెక్కుతుండగా.. ఇందులో మానుషి చిల్లర్(Manushi Chillar) హీరోయిన్‌గా నటిస్తుండగా.. హుమా ఖురేషి కీలక పాత్రలో కనిపించనుంది. అయితే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 11 విడుదల కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్రబృందం వరుస అప్డేట్స్ ఇస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తి పెంచుతున్నారు.
తాజాగా, ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ జూలై 1న రాబోతున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించారు. అంతేకాకుండా రాజ్ కుమార్ రావు వీడియోను కూడా జత చేసి అందరిలో క్యూరియాసిటీని పెంచారు. ‘‘పెద్దవారికి నమస్కారం.. చిన్నారులకు ప్రేమ అందిస్తున్నాను. మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నా జూలై 11న మా ‘మాలిక్’ సినిమా రాబోతుంది. మీ అందరికీ టీజర్ గుర్తుంది కదా. ఇప్పుడు ‘మాలిక్’ ట్రైలర్ రాబోతుంది. కలకత్తా, ముంబై, ఢిల్లీ, లక్నో, పట్నా, ఖాన్‌పూర్ ఎక్కడైనా సరే. ‘మాలిక్’ ట్రైలర్‌ను థియేటర్స్‌లో లాంచ్ చేయాలనుకుంటున్నా. మీరంతా మాలిక్‌కు మద్దతుగా నిలుస్తారనుకుంటున్నా. జూలై 1న కలుద్దాం. మీరంతా వస్తారు కదా.. చాలా మజా రాబోతుంది’’ అని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు రకరకాల కామెంట్లు చేస్తున్నారు.






