మోడీ బయోపిక్‌‌లో మలయాళ స్టార్.. టైటిల్‌తో భారీ హైప్.. ఎన్ని భాషల్లో విడుదల అవుతుందో తెలిస్తే షాక్!

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా బాక్సాఫీసు వద్ద బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది.

మోడీ బయోపిక్‌‌లో మలయాళ స్టార్.. టైటిల్‌తో భారీ హైప్.. ఎన్ని భాషల్లో విడుదల అవుతుందో తెలిస్తే షాక్!
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా బాక్సాఫీసు వద్ద బయోపిక్‌ల ట్రెండ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఎంతో మంది స్వతంత్ర సమరయోధులు, స్టార్ సింగర్స్, స్టార్ ప్లేయర్స్, స్టార్ యాక్టర్స్, పలువురు మాజీ ముఖ్యమంత్రులు బయోపిక్‌లు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి ఆదరణ పొందడంతో పాటుగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచాయి. ఇక ఇటీవల భారత ప్రధాని నరేంద్ర మోడీ జీవిత కథ ఆధారంగా ‘పీఎం నరేంద్ర మోడీ’ అనే పేరుతో వచ్చింది. వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మెప్పించలేకపోయింది. ఇక ఇప్పుడు మరోసారి ప్రధాని మోడీ బయోపిక్‌ను తీసుకురాబోతున్నారు.

నేడు ఆయన పుట్టినరోజు కావడంతో విషెస్ తెలుపుతూ మోడీ బయోపిక్‌కు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ మూవీ మేకర్స్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను షేర్ చేశారు. ఈ చిత్రానికి ‘మా వందే’ టైటిల్ ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను కూడా షేర్ చేశారు. ఈ సినిమా క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వంలో రాబోతుండగా.. రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నాడు. ఇక మోడీ పాత్రలో నాయకుడిగా మలయాళ స్టార్ హీరో ఉన్నిముకుందన్ నటిస్తున్నారు.

తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ, ఇంగ్లీష్, గుజరాతి, మరాఠీతో పాటు అన్ని భారతీయ భాషల్లో రాబోతుంది. ఇక విడుదలైన పోస్టర్‌లో మోడీ ఏదో ఫైల్‌పై సంతకం చేస్తూ కనిపించారు. ఇందులో ‘‘ఎన్నో పోరాటాల కన్నా... తల్లి సంకల్ప బలం గొప్పది’’ అని రాసి ఉండటం ఆసక్తికరంగా మారింది. ఈ పోస్ట్‌కు చిత్రబృందం.. ‘‘యుద్ధాలకు అతీతంగా ఎదిగిన ఒక వ్యక్తి కథ... యుగాలకు విప్లవంగా మారడానికి. గౌరవనీయులైన ప్రధానమంత్రి నరేంద్రమోడీకి పుట్టినరోజు శుభాకాంక్షలు.కీర్తి పునరుద్ధరించబడాలి.. ప్రకాశవంతమైన విషయాలు వేచి ఉండాలి’’ అనే క్యాప్షన్ జత చేశారు.

link

Next Story